Cricket Board Notice To Hardik Pandya, KL Rahul Over Comments On Women

హార్దిక్, రాహుల్ కు బీసీసీఐ నోటీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత ఆల్ రౌండర్ హార్దీక్ పాండ్య, కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీచేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు ఇద్దరు భారత క్రికెటర్లను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

  • మహిళలపై పాండ్య అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు

భారత ఆల్ రౌండర్ హార్దీక్ పాండ్య, కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీచేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు ఇద్దరు భారత క్రికెటర్లను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇటీవల కరన్ జోహార్ వ్యాఖ్యతగా ‘కాఫీ విత్ కరన్’ అనే హిందీ పాపులర్ టీవీ షోలో హర్దీక్, రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్దీక్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

వెంటనే స్పందించిన హర్దీక్ క్షమాపణలు తెలిపాడు. తన వ్యాఖ్యలతో ఎవరైన బాధపడి ఉంటే క్షమించండని, ఒకరిని బాధపెట్టాలనే ఉద్దేశం లేదని, చేసిన తప్పుకు పశ్చాతపం చెందుతున్నానని ట్వీట్ చేశాడు.  

Related Posts