16ఏళ్ల బాలికపై 2 ఏళ్లుగా లైంగిక దాడి….. నిందితుడి బాధితుల్లో ఈమె 7వది

  • Published By: murthy ,Published On : September 15, 2020 / 05:23 PM IST
16ఏళ్ల బాలికపై 2 ఏళ్లుగా లైంగిక దాడి….. నిందితుడి బాధితుల్లో ఈమె 7వది

16 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను పోలీసుల ఆదివారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తో గతంలో చేసిన అకృత్యాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే తమపైనా లైంగిక దాడులు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు బాధిత మహిళలు ఆరుగురు  పోలీసులకు సాక్ష్యం చెప్పారు.

భోపాల్ కు 500 కిలో మీటర్ల దూరంలోని సత్నా జిల్లాలో నిందితుడు సమీర్ అలియాస్ అతీక్ సైబర్ కేఫ్, జిమ్ నిర్వహిస్తూ ఉంటాడు. సమీర్ కి 2 పేర్లతోనూ పాస్ పోర్టులు ఉన్నాయి. గతంలో సమీర్ మతం మార్చుకుని ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2017లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరోక మహిళను మాయ మాటలతో లోబరుచుకుని ఆమెతో కొన్నాళ్లు సహజీవనం చేశాడు. ఆ మహిళను వదిలించుకునే క్రమంలో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.



ఇక అప్పటి నుంచి మాయమాటలతో మహిళలను లోబరుచుకుని వారిని లైంగికంగా  దోచుకుంటూ వారితో ఎంజాయ్ చేయసాగాడు. వారికి తెలియకుండా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు, పోటోలు తీసి వారికి చూపించి…వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్దనుంచి భారీగా డబ్బులు దోచుకునే వాడు.

ఆ క్రమంలో 16 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తూ, బ్లాక్ మెయిల్ చేయనారంభించాడు. అతీక్ అరాచకాన్నిభరించలేని బాలిక శుక్రవారం సెప్టెంబర్ 11వ తేదీన కోల్ గవాన్ పోలీసులకు  ఫిర్యాదు చేయటంతో ఈ అకృత్యాలు బయటపడ్డాయి.



అతీక్ పై కేసు నమోదైందని తెలిసి అతనితో వేధించబడిన బాధిత మహిళలు పోలీస్ స్టేషన్ కు వచ్చి అకృత్యాలపై ఫిర్యాదు చేశారు. కానీ తమ పేరు ఎక్కడా నమోదు చేయవద్దని కోరారని సత్నా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రియాజ్ ఇక్బాల్ తెలిపారు.



పోలీసులు అతీక్ ఇంటిపై జరిపిన దాడిలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల పేరుతో ఉన్న నకిలీ లెటర్ ప్యాడ్ లు స్వాధీనం చేసుకున్నారు. లెటర్ ప్యాడ్ లు రైల్వే  టికెట్ల రిజర్వేషన్ల కోసం ఉపయోగించినట్లు గుర్తించారు. అక్రమ నగదు సరఫరా చేయటంలో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అతీక్ చేసిన నేరాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.