జీతాలు అడిగిన టీచర్లపై లైంగిక వేధింపులు …టాయిలెట్స్ లో స్పై కెమెరాలు

  • Published By: murthy ,Published On : September 24, 2020 / 01:16 PM IST
జీతాలు అడిగిన టీచర్లపై లైంగిక వేధింపులు …టాయిలెట్స్ లో స్పై కెమెరాలు

Crime News జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయుల పట్ల దారుణంగా ప్రవర్తించిన స్కూల్ యాజమాన్యం చర్యలు ఆలస్యంగా వెలుగు చూశాయి. జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయులను వేధించటమే కాక టాయిలెట్స్ లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయట పడింది.

మీరట్ లోని సర్ధార్ బజార్ లో రిషబ్ అకాడమీ పేరుతో రంజిత్ జైన్ స్కూల్ నడుపుతున్నాడు. లాక్ డౌన్ సమయంలో స్కూల్ మూసివేశారు. దీంతో స్కూల్ లో పని చేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయిలు తమకు అందాల్సిన జీతాలు ఇవ్వమని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రంజిత్ జైన్, అతని కొడుకు అభినవ్ జైన్ జీతాలు ఇవ్వకుండా వేధించటమే గాకుండా మహిళల టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చారు.



జీతాలు అడగటానికి వచ్చిన మహిళా ఉపాధ్యాయులకు ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించారు తండ్రి కొడుకులు. దీంతో ఆగ్రహించిన పాఠశాలకు చెందిన 52 మంది మహిళా ఉపాధ్యాయులు స్కూల్ గేటు ముందు నిరసవ వ్యక్తం చేసి, అక్కడి నుంచి మీరట్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా తండ్రి కొడుకులు రహస్యంగా వీడియోలు తీసి…అవి చూపించి తమతో చనువుగా ఉండాలని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఆవేదనతో చెప్పారు.



ఒకవేళ తాము లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపటానికి కూడా వెనుకాడమని బెదిరించారని మరి కొందరు ఉపాధ్యాయులు ఆరోపించారు. పోలీసులు రంజిత్ , అభినవ్ లపై కేసు నమోదు చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. గతంలోనూ పాఠశాల యాజమాన్యం పలు వివాదాల్లో ఇరుక్కుంది. 2017లో సీఎం యోగిఆదిత్యనాధ్ లాగా అందరూ గుండు కొట్టించుకుని స్కూల్ కు రావాలని ఆదేశాలు జారీ చేసింది.