Objectionable photo of Hindu deities: కాళీమాత, శివుడిపై మ్యాగ‌జైన్‌లో అభ్యంతరకర రీతిలో చిత్రం.. కేసు న‌మోదు

''ది వీక్'' మ్యాగ‌జైన్‌లో జూలై 24న‌ హిందూ దేవుళ్ళ‌కు సంబంధించి అభ్యంతరకర రీతిలో ఓ చిత్రాన్ని ప్ర‌చురించారంటూ ఫిర్యాదు న‌మోదైంది. దీంతో ఆ ప‌త్రిక త‌మ వెబ్‌సైట్‌లో క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ''అపాల‌జీ ఫ్ర‌మ్ ది వీక్'' పేరుతో ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆ ప‌త్రిక వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చింది.

Objectionable photo of Hindu deities: కాళీమాత, శివుడిపై మ్యాగ‌జైన్‌లో అభ్యంతరకర రీతిలో చిత్రం.. కేసు న‌మోదు

objectionable photo of Hindu deities

Objectionable photo of Hindu deities: ”ది వీక్” మ్యాగ‌జైన్‌లో జూలై 24న‌ హిందూ దేవుళ్ళ‌కు సంబంధించి అభ్యంతరకర రీతిలో ఓ చిత్రాన్ని ప్ర‌చురించారంటూ ఫిర్యాదు న‌మోదైంది. దీంతో ఆ ప‌త్రిక త‌మ వెబ్‌సైట్‌లో క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ”అపాల‌జీ ఫ్ర‌మ్ ది వీక్” పేరుతో ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆ ప‌త్రిక వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చింది. ఎ టంగ్ ఆఫ్ ఫైర్ (అగ్ని నాలుక) పేరిట జూలై 24న ఆర్థికవేత్త వివేక్‌ దేబరాయ్ ఓ వ్యాసం రాశారు.

ఇందుకు సంబంధించిన చిత్రంలోనే హిందూ దేవుళ్ళు కాళీమాత, శివుడిని అభ్యంతరకర రీతిలో చూపార‌ని హిందూ సంఘాల‌ కార్యకర్తలు విమ‌ర్శ‌లు గుప్పించారు. కాన్పూర్‌లో ఆందోళ‌న తెలిపారు. ఎ టంగ్ ఆఫ్ ఫైర్ వ్యాసంలో ప్ర‌చురించిన చిత్రంపై బీజేపీ ఉత్తరప్రదేశ్ నేత‌ ప్రకాశ్ శర్మ కాన్పూర్‌ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ది వీక్ ఎడిట‌ర్‌తో పాటు యాజమాన్యంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేశారు.

ఈ నేప‌థ్యంలో వివేక్‌ దేబరాయ్ ది వీక్‌తో తన అనుబంధానికి ఇక ముగింపు ప‌లుకుతున్నానంటూ ది వీక్ ఎడిట‌ర్ ఫిలిప్ మాథ్యూకి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా వివేక్‌ దేబరాయ్ త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, వివేక్‌ దేబరాయ్ భార‌త‌ ప్రధాని ఆర్థిక సలహామండలి అధ్యక్షుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.

Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం