Free Fire Game: ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా బాలుడ్ని కాటేసిన పాము.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ లో ఆన్‌లైన్ గేమ్స్ కు బానిసగా మారిన బాలుడు.. ఇటుక బట్టీలపై కూర్చొని గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పాము కాటేసినప్పటికీ చలనం లేకుండా అలాగే గేమ్ ఆడుతూ అపస్మారకస్థితిలోకి వెళ్లి మరణించాడు.

Free Fire Game: ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా బాలుడ్ని కాటేసిన పాము.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

snake bite

Snake Bite: చిన్న పిల్లలు ఫోన్‌లకు బానిసలవుతున్నారు. ఫోన్ చేతిలో ఉంటే ఇక అదే ప్రపంచం అన్నట్లుగా గడిపేస్తున్నారు. నిద్ర, నీరు, తినడంసైతం వదిలేసి మరీ ఫోన్‌లలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ పలు అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ బాలుడు ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మధ్య‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్

ఓ బాలుడు ఫోన్‌లో ఫ్రీ ఫైర్ ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఈ సమయంలో పాము కాటేసినప్పటికీ గుర్తించలేక పోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఇటుక బట్టీలో పనిచేస్తోది. వారి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్. రెండేళ్లుగా వారు ఇక్కడ పనిచేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్తూ వారి దగ్గర ఉన్న ఫోన్‌ను ఇచ్చి వెళ్లేవారు. ఇలా చేతికి ఫోన్ వచ్చినప్పుడల్లా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ వాటికి బానిసయ్యాడు.

Bandla Ganesh : లవ్ యు అంటూ కేసీఆర్ ని సపోర్ట్ చేసిన బండ్లగణేష్.. ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

రెండు రోజుల క్రితం ఇదే తరహాలో తల్లిదండ్రుల వద్ద నుంచి ఫోన్ తీసుకున్న బాలుడు తమ్ముడుతో కలిసి ఇటుక బట్టీలపై కూర్చొని ఫోన్ లో ఫ్రీ ఫైర్ ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఈ సమయంలో ఇటుక బట్టీల్లో నుంచి వచ్చిన పాము బాలుడ్ని కాటేసింది. అయినా ఎలాంటి చలనం లేకపోవటంతో కొద్దిసేపటికే గేమ్ ఆడుతూనే బాలుడు కుప్పకూలిపోయాడు. అది గుర్తించిన ఇటుక బట్టీ యాజమాని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మృతుడు అహిర్వార్‌గా గుర్తించారు. బాలుడు పాము కాటు వల్లే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే శవపరీక్ష నివేదిక రావాల్సి ఉంది. నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.