పెళ్లి చేసుకుంటానని సినీ నటితో సహజీవనం చేసి, మోసం చేసిన వ్యాపారి

  • Published By: murthy ,Published On : July 31, 2020 / 12:33 PM IST
పెళ్లి చేసుకుంటానని సినీ నటితో సహజీవనం చేసి, మోసం చేసిన వ్యాపారి

సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తూ జీవనం గడుపుతున్న ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసి పెళ్ళి చేసుకోమనే సరికి తప్పించుకు తిరుగుతూ మోసం చేసిన వ్యాపారిపై నటి ఫిర్యాదు చేసింది.



సాధారణంగా సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనూ నటించే ఆడవాళ్లు అంటే కాస్తో కూస్తో నటనతో పాటు అందం కూడా ఉంటుంది. అలాంటి వారి పరిచయం కోసమో… వారితో జీవించటం కోసమో ఎదురు చూసే మగరాయుళ్లు ఉంటారు. ముంబై లో ఇదే జరిగింది.



సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ నటించే ఒక నటితో నాలుగేళ్లు సహజీవనం చేసి పెళ్లి మాటేత్తే సరికి తప్పించుకుతిరుగుతూ ఆమెను ఇంటినుంచి గెంటేసిన వ్యక్తిపై ఆ నటి శాంతాక్రజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.



ముంబై లోని ఓషివారా ప్రాంతంలో నివసించే ఒక నటికి 2016 లో సుదీప్ కుమార్ షా అనే వ్యాపారి(కాంట్రాక్టర్) పరిచయం అయ్యాడు. పరిచయం మరింత పెరిగి… ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కాల క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. త్వరలో ఎట్టాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని ఆమెను పూర్తిగా లైంగికంగా లోబరుచుకున్నాడు.

పెళ్లికి ముందు కొన్నాళ్లు కలిసి కాపురం చేద్దామని చెప్పి ఇద్దరూ సహజీవనం చేయటం మొదలెట్టారు. ఇక ఇద్దరి మధ్య శృంగార జీవనం కూడా మొదలయ్యింది. పెళ్లి కాకుండానే ఇద్దరూ ఆనందపు అంచులు చవి చూశారు.
జీవితాన్ని ఎంజాయ్ చేయసాగారు.



ఇద్దరం కలిసి సొంత ఇంట్లో ఉందామని చెప్పి సుదీప్ ఆమె వద్ద నుంచి కొంత డబ్బుతీసుకుని అపార్ట్ మెంట్ కూడా కొన్నాడు. అంతా హ్యాపీగా జరుగుతుండగా ఆమెకు ఒక చేదు నిజం తెలిసింది.అప్పటికే సుదీప్ కు పెళ్ళైందని, భార్యా పిల్లలు ఉన్నారని తెలుసుకుంది.

ఈ విషయమై సుదీప్ ను నిలదీసే సరికి కొన్నాళ్లు తప్పించుకు తిరిగాడు. ఒక రోజు గట్టిగా నిలదీసే సరికి ఆమెను ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సుదీపై పై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ ఒక నటి మరో వ్యాపారి పై ఇలాగే కేసు పెట్టిందని ..ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.