రూ.3వేల మద్యానికి లక్షా రూ.60వేలు దోచేసిన వ్యాపారి…ఆన్ లైన్ మోసాలు

  • Published By: murthy ,Published On : August 28, 2020 / 05:50 PM IST
రూ.3వేల మద్యానికి లక్షా రూ.60వేలు దోచేసిన వ్యాపారి…ఆన్ లైన్ మోసాలు

కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ బార్లు తెరుచుకోకపోవటంతో మద్యం ప్రియులు వారాంతాల్లో ఎక్కడో ఒక చోట పార్టీలు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైలోని చండీవాలికి చెందిన  వ్యాపారస్తుడు శశికాంత్ విశ్వకర్మ కూడా వారాంతంలో తన మిత్రులతో కలిసి చిన్న పార్టీ ఏరేంజ్ చేశాడు.

పోవైలోని తన స్నేహితుడి ఇంట్లో ఆగస్టు 23న మందు పార్టీ ఎరేంజ్ చేసుకుని అందుకు అవసరమైన మద్యా్ని ఆన్లైన్లో కొనుగోలుచేయటానికి సెర్చ్ చేశాడు. అతనికి ఆన్ లైన్ లో మద్యం డెలివరీ చేసే స్టార్ వైన్ ను సంప్రదించి తమకు అవసరమైన బ్రా్ండ్ లు ఆర్డరు ఇచ్చాడు. 3వేల రూపాయల మద్యం కొనుగోలు చేసి, ఆన్ లైన్ లో బిల్ పే చేయటానికి తన క్రెడిట్ కార్డు వివరాలు మద్యం వ్యాపారికి చెప్పాడు.

శశికాంత్ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ చెప్పమని ఆ మద్యం వ్యాపారి కోరాడు. శశికాంత్ OTP  చెప్పిన కొద్ది సేపటికి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ. 61,000 లు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అలర్టైన శశికాంత్ మద్యం వ్యాపారికి వెంటనే ఫోన్ చేయగా పొరపాటున జరిగిందని……మీ ఎకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎసీ కోడ్ వంటి పూర్తి వివరాలు పంపిస్తే, ఎమౌంట్ తిరిగి పంపిస్తానని వినయంగా చెప్పాడు.

మద్యం వ్యాపారిని నమ్మి అన్ని వివరాలు చెప్పాడు. చెప్పిన కొద్ది సేపటికి అతని ఖాతా నుంచి మరోక 40 వేల రూపాయలు ,61,000 రూపాయలు డెబిట్ చేయబడ్డాయి. వెంటేనే తాను మోసపోయానని గ్రహించిన శశికాంత్ పోవై పోలీస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

పోలీసు స్టేషన్ నుంచి అంతకు ముందు ఫోన్ చేసిన మద్యం వ్యాపారికి ఫోన్ చేయగా ఆ విషయం తనకు తెలియదని సమధానం వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని….శశికాంత్ వద్ద బ్యాంకు ఎకౌంట్ వివరాలు తీసుకుని విచారణ చేస్తున్నారు.