పంట కాల్వలో దూసుకెళ్లిన కారు….ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి

  • Published By: murthy ,Published On : September 14, 2020 / 01:46 PM IST
పంట కాల్వలో దూసుకెళ్లిన కారు….ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. కారు పంట కాలువ లోకి దూసుకు వెళ్లిపోయిన ఘటనలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు విడిచారు.తణుకు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ని పంట కాల్వలోకి సోమవారం ఉదయం కారు దూసుకువెళ్లటంతో ఒక మహిళా ఉద్యోగిని సుభాషిణి తో సహా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.




బీమవరానికి చెందిన ఈ ముగ్గురు ప్రతిరోజు విధి నిర్వహణకు ద్విచక్రవాహనాలపై తణుకు వెళ్లి వచ్చేవారు. అయితే గత రెండు రోజులుగా ఎడ తెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో కారు లో వెళుతున్నారు. సోమవారం ఉదయం కూడా విధుల్లోకి వెళ్లేందుకు కారులో బయలు దేరగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది.
https://10tv.in/girl-gang-rape-in-hyderabad-with-nude-photos/
మరణించిన వారిని తణుకు మున్సిపల్ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జీవన శేఖర్‌, ఆర్‌టీఓ ఆఫీస్‌లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, వెలుగు డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగిని సుభాషిణిగా పోలీసులు గుర్తించారు. పంట కాలువలోంచి వీరి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.