వివేకా హత్య కేసులో విచారణ స్పీడ్ పెంచిన సీబీఐ

  • Published By: murthy ,Published On : July 27, 2020 / 01:57 PM IST
వివేకా హత్య కేసులో విచారణ స్పీడ్ పెంచిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం మార్చారు.

కడప నగర శివారులోని కేంద్ర కారాగారం అతిధిగృహంలోకి తమ మకాం మార్చారు. రహస్య విచారణ కోసమే సీబీఐ అధికారులు మకాం మార్చినట్లు తెలుస్తోంది. 10 రోజులుగా ప్రతిరోజు పులివెందుల వెళ్లివస్తూ అనుమానితులను విచారిస్తూ వచ్చారు.

గతంలో విచారణ జరిపిన సిట్ నివేదికలను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వ్యక్తం చేసిన అనుమానితులతో పాటు, వారికి అనుమానం ఉన్న అందరినీ విచారించేందుకు రంగం సిధ్దం చేసారు.