Constable Fights With Home Guard: నడిరోడ్డుపై భీకరంగా కొట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు… వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జాలౌన్ పోలీసు అధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. హోం గార్డుపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వివరించారు. నడిరోడ్డుపై వారు గొడవపడిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.

Constable Fights With Home Guard: నడిరోడ్డుపై భీకరంగా కొట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు… వీడియో వైరల్

Constable Fights With Home Guard

Constable Fights With Home Guard: శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన బాధ్యతల్లో ఉన్నారు ఆ పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు. సమాజంలో గొడవలు జరగకుండా అదుపు చేసేందుకు కారులో ఓ ప్రాంతానికి వెళ్ళారు. అయితే, రోడ్లపై జరిగే గొడవలను ఆపాల్సిందిపోయి నడిరోడ్డుపై ఆ పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డే భీకరంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానిక వ్యక్తి స్మార్ట్ ఫోనులో తీశాడు. కానిస్టేబుల్, హోంగార్డు కొట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కానిస్టేబుల్, హోంగార్డు ఎందుకు ఇంతగా గొడవపడ్డారన్న విషయంపై స్పష్టత లేదు. ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జాలౌన్ పోలీసు అధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. హోం గార్డుపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వివరించారు. నడిరోడ్డుపై వారు గొడవపడిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. వారిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

గొడవపడ్డ కానిస్టేబుల్, హోంగార్డు.. పోలీసు అధికారి వివరణ