Delhi: పోలీసును చుట్టుముట్టి పోలీస్ స్టేషన్‭లోనే మూక దాడి

పది నుంచి పన్నెండు మంది పోలీసు స్టేషన్‭లోకి చొచ్చుకు వచ్చి హెడ్ కానిస్టేబుల్‭ను దుర్భషలాడటం ప్రారంభించారు. అప్పటికే ఆయన క్షమించాలంటూ వారిని బతిమిలాడుతున్నారు. ఒక వ్యక్తి ఆయన కాలర్ పట్టుకుని ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్లు తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇంతలో కాలర్ పట్టుకున్న వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‭ని కొట్టాడు. పలుమార్లు కొట్టాడు. పోలీసు స్టేషన్‭లోనే ఈ ఘటన జరిగినప్పటికీ పోలీసులెవరూ అటువైపు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించిన వీడియోను మరొక పోలీసు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

Delhi: పోలీసును చుట్టుముట్టి పోలీస్ స్టేషన్‭లోనే మూక దాడి

Cop beaten and threatened in police station

Delhi: ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్‭ను ఆయన పని చేస్తున్న స్టేషన్‭లోనే కొంత మంది చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. బెదిరింపులు చేస్తూ, తిడుతూ ఆయనపై భౌతిక దాడికి దిగారు. ఇంత జరుగుతున్నా స్టేషన్‭లో ఒక్క పోలీసు అటు వైపు రాలేదు. పైగా ఒక పోలీసు దీన్నంతిటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తులు అలా ఏకంగా స్టేషన్‭లోకే వచ్చి ఒక పోలీసుపై దాడి చేయడంపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‭లో జరిగినట్లు చెప్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ పోలీసులపై పోలీసులకే పట్టింపు లేదు, ఇక వారికి ప్రజల రక్షణ పట్ల ఏం పట్టింపు ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియో ప్రకారం.. పది నుంచి పన్నెండు మంది పోలీసు స్టేషన్‭లోకి చొచ్చుకు వచ్చి హెడ్ కానిస్టేబుల్‭ను దుర్భషలాడటం ప్రారంభించారు. అప్పటికే ఆయన క్షమించాలంటూ వారిని బతిమిలాడుతున్నారు. ఒక వ్యక్తి ఆయన కాలర్ పట్టుకుని ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్లు తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇంతలో కాలర్ పట్టుకున్న వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‭ని కొట్టాడు. పలుమార్లు కొట్టాడు. పోలీసు స్టేషన్‭లోనే ఈ ఘటన జరిగినప్పటికీ పోలీసులెవరూ అటువైపు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించిన వీడియోను మరొక పోలీసు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆ కానిస్టేబుల్‭ను ఎందుకు కొట్టారనే విషయం ఇప్పటికీ తెలియలేదు. దాడికి పాల్పడ్డ వారిని ఇప్పటికీ గుర్తించలేదట. దాడికి పాల్పడ్డ నిందితులను వెతికే పనిలో ఉన్నామని, వారిని తొందర్లోనే పట్టుకుంటామని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. దేశ రాజధానిలో ఇలా జరగడం పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమని నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

BJP questions Rahul: అది సంఘీభావమా, స్టంటా?.. కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకోవడంపై రాహుల్‭కు బీజేపీ ప్రశ్న