క్వారంటైన్ పేరుతో నర్స్ పై అత్యాచారం

  • Published By: murthy ,Published On : September 9, 2020 / 07:58 AM IST
క్వారంటైన్ పేరుతో నర్స్  పై అత్యాచారం

కరోనా వైరస్  కామాంధులకు భలే కలిసొచ్చింది. మొన్నటికి మొన్న ఒక కామాంధుడు మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే….. కేరళలో  19 ఏండ్ల యువతిపై కరోనా అంబులెన్స్‌ డ్రైవర్‌ లైంగిక దాడి చేసాడు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే…. కేరళలో ఒక హెల్త్ ఇన్ స్పెక్టర్ హోం క్వారంటైన్ పేరుతో నర్స్ పై లైంగిక దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.




కేరళలోని పంగోడే పోలీస్ స్టేషన్ పరిధిలోని  మలప్పురంలో 44 ఏళ్ల మహిళ హోం నర్సుగా పని చేస్తున్నారు. ఇటీవల ఆమె తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా హెల్త్ ఇన్స్ పెక్టర్ ఆమెను క్వారంటైన్ కు వెళ్ళాల్సిందిగా సూచించాడు.
https://10tv.in/telugu-tv-serials-actress-sravani-get-suicide/
క్వారంటైన్ కు వెళ్లే ముందు ఆమె యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోగా, నెగెటివ్‌ అని తేలింది. నెగెటివ్ వచ్చిన సర్టిఫికెట్ ఇవ్వమని కోరగా ఇంటికి వచ్చి తీసుకు వెళ్లమని హెల్త్ ఇన్ స్పెక్టర్ చెప్పాడు. సెప్టెంబర్ 3వ తేదీన ఆమె సర్టిఫికెట్ కోసం అధికారి ఇంటికి వెళ్లగా …. ఆమె పై అత్యాచారం చేసి బంధించాడు.




సెప్టెంబర్ 4వ తేదీన ఆమెను వదిలేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెల్త్ ఇన్ స్పెక్టర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై మహిళా  కమిషన్‌ కేసు నమోదు చేసింది. హెల్త్ ఇన్ స్పెక్టర్ పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించింది.