ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిటీ స్కాన్ దందా

ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిటీ స్కాన్ దందా

కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శ్రీధర్ అనే వ్యక్తి తన తల్లిని ఆయాసం సమస్యతో తీసుకెళ్తే… లోపలకి కూడా రానివ్వకుండానే ఓ జూ. డాక్టర్ ఎదుగావచ్చి ” మీరు హైపర్ రెస్పిరేటరీ స్కానింగ్ చేయించుకోవాలి అని చెప్పాడు. దీంతో శ్రీధర్ అసలు మా అమ్మ పరిస్థితి పూర్తిగా చూడకుండానే మీరు స్కానింగ్ కి ఎలా రాస్తారు అని వారిని ప్రశ్నిస్తే… ఇప్పుడంతా COVID కాబట్టి… ముందుగా ఎవరు వచ్చినా సీటీ స్కాన్‌ చేసిన తర్వాతే డాక్టర్లను కలవాలి అని చెప్పారు.



ఇక్కడ మాత్రమే కాదు అన్ని జిల్లాల్లోని ప్రైవేటు హాస్పిటల్స్ లో ఇలాంటి మోసాలే నడుస్తున్నయి. ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు వెలితే చాలు ముందుగా సీటీ స్కాన్‌ చేయించుకొవాలని చెప్తున్నారు. ఆ ఒక్క స్కాన్ కే రూ.8000 నుంచి రూ.10 వేల దాకా వసూలు చేస్తున్నారు. దీంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాములు దగ్గు, జలుబు, ఇతర ఛాతి సంబంధిత సమస్యలు ఉంటే కరోనా అనుమానితులే అంటూ వారిని వైద్యులు సీటీ స్కానింగ్‌కు రిఫర్‌ చేస్తున్నారు.



మంచిర్యాల, ఆదిలాబాద్‌, జనగాం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండ తదితర జిల్లాల్లో ప్రజలను ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. గతంలో రూ.6 వేలకు ఉండే ఈ స్కానింగ్‌ ఇప్పుడు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షలకు తోడు ఎక్స్‌రే, రక్త పరీక్షలు, షుగర్‌, బీపీ, థైరాయిడ్‌ అంటూ అవసరం లేని పరీక్షలన్నీ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.



స్కానింగ్‌ అవసరం లేదంటున్న ప్రభుత్వం:
కరోనా లక్షణాలున్న వారికి కేవలం ఆర్టీపీసీఆర్‌ లేదా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయాలని స్కానింగ్‌ అవసరం లేదని ప్రభుత్వం సూచిస్తున్నది. సీటీస్కాన్‌ అందరికీ అవసరం లేదని, పెద్దగా ప్రయోజనం కూడా ఉండదని చెబుతూ.. ఆర్ట్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చి తీవ్రమైన లక్షణాలు ఉన్న వారికి మాత్రమే సీటీ స్కాన్‌ ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.