ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు …ముగ్గురు అరెస్ట్

10TV Telugu News

ప్రియుడిని హత్య చేసిన కేసులో ఉత్తర ఢిల్లీ పోలీసులు ప్రియురాలితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో సెప్టెంబర్11వ తేదీ, శుక్రవారం ఒక మృతదేహం పడి ఉందని స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని వజీరాబాద్ లో నివసించే సాహిల్ గా(23) గుర్తించారు.

మృతదేహం మెడపైన గాయం ఉన్నట్లు కనుగొన్నారు. నిందితులను గుర్తించటానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి విశ్లేషించారు. ముగ్గురు నిందితులు సాహిల్ ను తీసుకు వెళుతున్నట్లు తెలుసుకున్నారు. సాహిల్ ను తీసుకు వెళుతున్న వారు వర్ష(24) ఆమె సోదరుడు ఆకాష్(23) అతని స్నేహితుడు ఆలీ(20) గా గుర్తించారు.పోలీసులు శాస్త్రి పార్క్ వద్ద వర్ష అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా అది తాళం పెట్టి ఉంది. వర్షా గురించి వివరాలు సేకరించిన పోలీసులు నిందితులు ముగ్గురిని ఉత్తర ప్రదేశ్ లోని హార్డోయి లో అరెస్టు చేసినట్లు డీసీపీ అంటో ఆల్ఫోన్స్ తెలిపారు.
https://10tv.in/peeved-over-affair-with-sister-brother-slits-mans-throatdelhi/
వర్షా, సాహిల్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సెప్టెంబర్ 10 వ తేదీ రాత్రి సాహిల్ వర్షా ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఆమె సోదరుడు ఆకాష్, ఆలీ, ఉన్నారు. ముగ్గురు మద్యం సేవించి ఉన్నారు. కొంత సేపటి తర్వాత సాహిల్ వర్షతో సన్నిహితంగా ఉండసాగాడు. మిగిలినివాళ్లు ఉన్నారు… వద్దు అని వర్ష  వారించింది. సాహిల్ వర్షతో సన్నిహితంగా ఉండటం నచ్చని ఆకాష్ సాహిల్ ను వెళ్లిపొమ్మన్నాడు.ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశంలో ఆకాష్ సాహిల్ గొంతుకు బెల్టుబిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ముగ్గురు కలిసి సాహిల్ మృతదేహాన్ని మోసుకుంటూ వచ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో….ఉత్తర ప్రదేశ్లోని హోర్డోయి పారిపోయారు. అనుమానిత మృతదేహాంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

10TV Telugu News