జంగిల్ బాయ్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు

  • Published By: murthy ,Published On : August 18, 2020 / 10:14 AM IST
జంగిల్ బాయ్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు

పలు నేరాలతో సంబంధం ఉన్న జంగిల్ బాయ్ రాంబాబును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని తలపై 25 వేల రూపాయల రివార్డు కూడా ఉంది. హత్యలు చేసి పోలీసుల నుంచి తప్పించుకోటానికి అడవుల్లోకి వెళ్లిపోతూండటంతో రాంబాబు జంగిల్ బాయ్ గా పోలీసు రికార్డుల్లో కెక్కాడు.



రాంబాబు పై 3 హత్య కేసులు నమోదై ఉన్నాయి. హత్య కేసులో క్లూ లభించినప్పటికీ పోలీసులకు చిక్కకుండా రాంబాబు అడవుల్లోకి వెళ్లి తల దాచుకుంటున్నాడు. ఈ ఏడాది మే 17 న ఢిల్లీ సంగం విహార్లో నివసించే 21 ఏళ్ల రోహిత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో రాంబాబు పాత్రను పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి రాంబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసులకు అందిన ముందస్తు సమాచారం ప్రకారం జంగిల్ బోయ్ రాంబాబు సోమవారం, ఆగస్టు 17, ఉదయం ఫరీదాబాద్ అటవీ ప్రాంతంనుంచి తన అనుచరుడిని కలుసుకోటానికి ఊళ్లోకి వస్తున్నట్లు తెలుసుకున్నారు. సోమవారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి ,మిలటరీ ఏరియా లోకి ప్రవేశించాడు రాంబాబు.



అతని కోసం కాచుకుని కూర్చున్న పోలీసులు చుట్టుముట్టారు. రాంబాబు పారిపోవటానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడ్ని వెంబడించి పట్టుకోబోగా తనవద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. లొంగిపొమ్మని హెచ్చరించినప్పటికీ అతను పోలీసులపైకి కాల్పులు జరపటంతో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. బుల్లెట్ ఫ్రూవ్ జాకెట్ ధరించన మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చివరికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి రాంబాబు ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి ఒక దేశవాళీ పిస్టల్ మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.