పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని నక్లెస్ గిఫ్ట్ తో ఇంప్రెస్ చేయడానికి చైన్ స్నాచర్ గా మారాడు

  • Published By: murthy ,Published On : July 24, 2020 / 09:32 AM IST
పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని నక్లెస్ గిఫ్ట్ తో ఇంప్రెస్ చేయడానికి చైన్ స్నాచర్ గా మారాడు

పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నక్లెస్ గిఫ్టు గా ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి చైన్ స్నాచర్ గా మారాడు ఓ యువకుడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. తేలికగా డబ్బు సంపాదించే మార్గం ఏముందా అని ఆలోచించాడు.

అంతేకాదు తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మంచి నక్లెస్ గిఫ్టుగా ఇవ్వాలనుకున్నాడు. నెక్లెస్ కొనాలంటే డబ్బు కావాలి ..ఇప్పటికిప్పుడు అంతడబ్బు త్వరగా సంపాదించలేడు. తేలికగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు ఎంచుకున్నాడు. అందులోనూ చైన్ స్నాచింగ్ మార్గంగా ఎంచుకుని పోలీసులకు దొరికి పోయాడు.

రోజూ మాదిరిగానే గురుగావ్ పాలం విహార్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పాలం ఫ్లై ఓవర్ కాళి టెంపుల్ వద్దకు వస్తుండగా, మంగ్లాపురి నుంచి బైక్ పై వస్తున్నఒక యువకుడు పోలీసులను చూసి పారిపోవటానికి ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిన వెంబడించి పట్టుకున్నారు. అతను అజయ్ బోడా(28) గా గుర్తించారు.

అతడ్ని విచారించి…ఒక దేశవాళి పిస్తోలు. మొబైల్ ఫోన్, ఒక బంగారు గొలుసు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. అజయ్ అనేక దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుడని పోలీసులు తెలిపారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నక్లెస్ గిఫ్టుగా ఇచ్చేందుకే చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు అజయ్ విచారణలో చెప్పటంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.