హైదరాబాద్ లో డ్రగ్స్, అమ్మాయిల సరఫరా ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో డ్రగ్స్, అమ్మాయిల సరఫరా ముఠా అరెస్ట్

Hyderabad Police Busted Drug Rocket : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గోవా నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకు వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు డ్రగ్స్ సరఫరా చేయటిమే కాక ఇతర రాష్ట్రాలనుంచి యువతులను రప్పించి వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సల్మాన్‌ అనే వ్యక్తితో పాటు హైమద్‌ అనే వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సల్మాన్ ద్వారా పది పబ్ లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.



డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న పబ్స్ వివరాలను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.  నిందితులిద్దరూ డ్రగ్స్‌ మాత్రమే కాకుండా……ఈశాన్య రాష్ట్రాలతో పాటు గోవా నుంచి అమ్మాయిలను కూడా హైదరాబాదుకు తీసుకు వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

పబ్ కు వచ్చే వారికి అమ్మాయిలను, వారి ద్వారా డ్రగ్స్ సల్మాన్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. మరోక ప్రాంతంలో విడిగా అమ్మాలయితో  వ్యభిచారం సైతం నడిపిస్తునట్లు విచారణలో తెలుసుకున్నారు. నిందితులనుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.