రేపట్నించి పోలీసు స్టేషన్ ముందు కూర్చుంటా…..నిందితులందరికీ వెంటనే శిక్ష పడాలి

  • Published By: murthy ,Published On : September 26, 2020 / 02:59 PM IST
రేపట్నించి పోలీసు స్టేషన్ ముందు కూర్చుంటా…..నిందితులందరికీ వెంటనే శిక్ష పడాలి

హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి…హేమంత్ ని కాంప్రమైజ్ అవుదామని చెప్పి పిలిచి చంపేశారని  అతని సోదరుడు సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు అహంతోనే తన అన్నను చంపారని…. తన సోదరుడ్ని చంపిన 12 మందిని తన ముందు కూర్చో పెట్టాలని సుమంత్ డిమాండ్ చేస్తున్నాడు.

తాను ఆదివారం నుంచి పోలీసు స్టేషన్ ముందే కూర్చుంటానని…. డబ్బున్న వాళ్లు డబ్బున్నవాళ్లనే ప్రేమించాలా ? అని ప్రశ్నిస్తున్నాడు. పోలీసులను మేనేజ్ చేసేందుకు లక్ష్మారెడ్డి పోలీసులకు డబ్బు ఎర వేశాడని సుమంత్ ఆరోపిస్తున్నాడు. అయితే పోలీసులు డబ్బు తీసుకోకుండా డబ్బు మొఖాన కొట్టారని అంటున్నాడు సుమంత్. తన అన్న చావుకు కారణమైన వారికి బెయిల్ రాకుండా చూడాలని సుమంత్ కోరుతున్నాడు.



తన అన్న పెళ్లి చేసుకున్ననాటి నుంచి అవంతి కుటుంబ సభ్యులనుంచి తమ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చేవని సుమంత్ తెలిపాడు. నిందితులందరినీ విచారిస్తే ఎవరూ నేరానికి ప్రోత్సహించారో తెలుస్తుందని అన్నాడు. అవంతి తల్లితండ్రులనుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి హేమంత్ విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నాడని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుండగానే ఈ ఘోరం జరిగిందని సుమంత్ చెప్పాడు.

గచ్చిబౌలి సీఐ గారి నిజాయితీ వల్లే కిడ్నాప్ హత్య విషయం వెలుగు చూసిందని…లేకపోతే మాకు అన్యాయం జరిగేదని అన్నాడు. మా అన్న చావుకు తగ్గ శిక్ష పడాలని సుమంత్ కోరాడు. హేమంత్ ను చంపటానికి నెల ముందే నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్ లు రెక్కీ నిర్వహించినట్లు రిమాండ్ రిపోర్టు లో పోలీసులు పేర్కోన్నారు.



కిరాయి హంతకులతో యుగంధర్ పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు పోలీసు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు, మాయమాటలు చెప్పి నెల రోజులుగా అవంతిని తమవైపుకు తిప్పుకోవాలని లక్ష్మారెడ్డి ప్లాన్ చేశాడని తెలుస్తోంది. హేమంత్ అంత్యక్రియలు శనివారం శేరిలింగం పల్లి శ్మశాన వాటికలో జరిగాయి.