అమ్మాయి కాళ్లు పట్టించినా సిగ్గురాలేదు :వివాహితుడి మోసాలు..డబ్బులు వసూళ్లు..

  • Edited By: nagamani , December 5, 2020 / 02:37 PM IST
అమ్మాయి కాళ్లు పట్టించినా సిగ్గురాలేదు :వివాహితుడి మోసాలు..డబ్బులు వసూళ్లు..

Hyderabad  married man affairs : ప్రేమ..పెళ్లి అంటూ ఓ పైళ్లైన వ్యక్తి ఆరుగురు అమ్మాయిలను మోసం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని అమ్మాయిలకు గాలం వేయటం అతిని హాబి. అమ్మాయిలతో పరిచయం పెరిగాక..ప్రేమించానంటాడు.పెళ్లి చేసుకుందామంటాడు. మాయ మాటలు చెప్పి అమ్మాయిల నుంచి చక్కగా డబ్బులు దండుకుంటాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సదరు దగాకోరుపై కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నగరంలోని చందానగర్ కు చెందిన కుర్ర విజయభాస్కర్ కు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన సౌజన్యతో 207లో వివాహం జరిగింది. వీళ్లకు మూడు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు.డబ్బుపిచ్చి ఉన్న విజయభాస్కర్ ఫేస్ బుక్ లో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకునేవాడు.అలా ప్రేమ అంటూ నమ్మించేవాడు.అలా అతని వలలో ఇద్దరు అమ్మాయిలు పడ్డారు. వాళ్లతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగేవాడు.ఆ తరువాత వాళ్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. అలా అందినకాడికి డబ్బులు దండుకోవటం వాడికి అలవాటుగా మారింది. ముఖ్యంగా ఆంద్రా అమ్మాయిల్ని..హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ గా పనిచేసే అమ్మాయిల్నే టార్గెట్ గా పెట్టుకున్న విజయ్ భాస్కర్ ఫేస్ బుక్ మోసాలకు పాల్పడేవాడు.ఈ విషయం భార్య సౌజన్యకు తెలియటంతో భర్తను నిలదీసింది. అప్పటికే భార్యను వదిలించుకుని మేనకోడల్ని పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో ఉన్న విజయభాస్కర్ భార్యను వేధించటం మొదలుపెట్టాడు.దానికి తల్లిదండ్రులు కూడా తోడవ్వటంతో భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు సౌజన్యకు ఎక్కువయ్యాయి. దీంతో సౌజన్య పుట్టింటికి వెళ్లిపోయి ప్రకాశం జిల్లా పోలీసులకు భర్తమీద ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఒంగోలు పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసులు విచారణలో విజయభాస్కర్ మోసాలు ఒక్కొక్కటిగా బైటపడ్డాయి. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వారితో సన్నిహితంగా మెలిగి డబ్బులు దండుకునేవాడు. అలా ఇప్పటి వరకూ విజయభాస్కర్ ఆరుగురు యువతులను పెళ్లి పేరుతో నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నమ్ముకుని వస్తే జీవితాన్ని నాశనం చేశాడని భార్య ఆవేదన చెందుతోంది. తన వద్ద నుంచి 25 తులాల బంగారం, రూ. 15 లక్షల కట్నం తీసుకున్నాడని ఆమె వాపోయింది. తనకు మూడేళ్ల బాబు ఉన్నాడని, ఎలాగైనా తనకు న్యాయం చేయాలని భార్య పోలీసులను వేడుకుంటోంది.కాగా గతంలో భార్య ఉండగానే..విజయభాస్కర్ పెళ్లి పేరుతో ఓ అమ్మాయిని మోసం చేయగా..సదరు యువతి తల్లిదండ్రులు విజయభాస్కర్ ని బాగా తిట్టారు. ఆ అమ్మాయి కాళ్లు పట్టించారు.మరోసారి ఇలా అమ్మాయిల జోలికి రానని చెప్పించి క్షమాపణలు చెప్పించారు. అయినా బుద్దిరాని విజయభాస్క్ అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడటం మానలేదు. దీంతో భర్తతో విసిగిపోయిన సౌజన్య తన మూడేళ్ల కొడుకుకు నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతోంది.