వివాహితపై అత్యాచారం….జర్నలిస్ట్ పై కేసు నమోదు

10TV Telugu News

Hyderabad crime news హైదరాబాద్ లోని స్ధానిక పత్రికలో పనిచేసే ఒక జర్నలిస్ట్ వివాహితపై అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్(35) వనస్ధలిపురంలో నివాసం ఉంటున్నాడు. పంజాగుట్ట లోని ఒక పత్రికలో రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఇంటి సమీపంలోని ఒక  కుటుంబంతో నాలుగేళ్లుగా పరిచయం ఏర్పడింది.నాలుగేళ్ళుగా ఆ కుటుంబంతో ఉన్న పరిచయం కొద్ది ఆ ఇంటి గృహిణితో శివప్రసాద్ చనువుగా ఉండటం మొదలెట్టాడు. ఈక్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అది నచ్చని గృహిణి హద్దుల్లో ఉండమని అతడ్ని హెచ్చరించింది.

ఆమె కోపం పెంచుకున్న జర్నలిస్ట్ ఆమె పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించసాగాడు. సెప్టెంబర్ 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.