సినిమా సీన్ తలపించిన లారీ దొంగతనం

10TV Telugu News

lorry theft in trichy : తమిళనాడులోని తిరుచ్చిలో లారీ దొంగతనం జరిగింది. సినిమా సీన్ ను తలపించేలా…. పోలీసులు లారీని 60 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. మూడు కార్లలో దొంగ వెంటబడ్డ పోలీసులు… అరియమంగళంలో దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగను అరెస్ట్‌ చేసే క్రమంలో పోలీసులపై దాడి చేసాడు.

తిరుచ్చిలోని మణప్పురై వద్ద ఆగి ఉన్న లారీని దుండగుడు దొంగిలించి తీసుకువెళ్లాడు. లారీ యజమాని అది గమనించి పట్టుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వేరోక కారులో లారీని వెంబడించాడు.పోలీసులు కూడా మరొక రెండు వాహనాల్లోనూ లారీని వెంబడించి దాదాపు 60 కిలోమీటర్ల తర్వాత పట్టుకున్నారు.దుండగుడు పాత నేరస్ధుడే అని గుర్తించారు. నిందితుడిపై గతంలో పలు వాహానాలు దొంగిలించిన కేసులు ఉన్నట్లు తెలిపారు. లారీని ఛేజ్ చేసి పట్టుకోవటం, దొంగను బంధించటం.. పోలీసులు దొంగను బంధించినప్పుడు తప్పించుకు పారిపోవాలని ప్రయత్నించటం…. ఈ మొత్తం ఎపిసోడ్  సినిమా సీన్ ను తలపించింది.


10TV Telugu News