డబ్బు కోసం నీచానికి దిగిన యువకుడు. రూ.100కి డేటింగ్ యాప్‌లలో భార్యలతో సన్నిహితంగా ఉన్న లైవ్ స్ట్రీమింగ్

  • Published By: murthy ,Published On : October 26, 2020 / 01:57 PM IST
డబ్బు కోసం నీచానికి దిగిన యువకుడు. రూ.100కి డేటింగ్ యాప్‌లలో భార్యలతో సన్నిహితంగా ఉన్న లైవ్ స్ట్రీమింగ్

live streaming wives on apps : మధ్య ప్రదేశ్ కు చెందిన ఒక యువకుడు(24) తన ఇద్దరు భార్యలతో సన్నిహితంగా ఉండే  దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రేక్షకులు చూడాటానికి రేట్ నిర్ణయించాడు.  ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ బండారం బయటపడింది.

మానవ బలహీనతలను ఆసరాగా చేసుకుని మధ్యప్రదేశ్ కు చెందిన 10 వ తరగతి వరకు చదువుకున్న వ్యక్తి ఈ దారుణాలకు పాల్పడ్డాడు. చదివింది 10 అయినా..టెక్నాలజీ వాడకంలో దిట్ట. స్మార్ట్ ఫోన్ల లో సాంకేతికంగా వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకున్నాడు. సోషల్ మీడియా వాడకం బాగా నేర్చుకున్నాడు. ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించటం నేర్చుకున్నాడు.



అతనికి ఇద్దరు భార్యలు. ఇద్దరినీ సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఒకసారి పెళ్లైన విషయం రెండో భార్యకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కాగా రెండో భార్యను బ్లాక్ మెయిల్ చేయటానికి ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి భద్రపరుచుకున్నాడు.
https://10tv.in/uttar-pradesh-7-year-old-boy-sexually-abuses-5-years-girl-in-aligarh/
బహుళ ప్రాచుర్యంలో ఉన్న టిండర్, టాంగో వంటి డేటింగ్ యాప్ లలో ప్రోఫైల్ క్రియేట్ చేశాడు. ప్రోఫైల్ పిక్చర్ గా అతను భార్యలతో సన్నిహితంగా ఉన్నప్పటి చిత్రాన్ని పెట్టాడు. అది ఇష్టపడిన వారు ఎవరైనా డెమో కోసం 100 రూపాయలు చెల్లించాలని రేటు నిర్ణయించాడు.



డెమో నచ్చితే లైవ్ కు వివిధ రేట్లు నిర్ణయించాడు. నిర్ధిష్ట సమయానికి రూ.500, రూ.700, రూ.1000 వరకు రేట్లు నిర్ణయించాడు. వీటిలో ఫేస్ లెస్, విత్ ఫేస్ లైవ్ సదుపాయాలు కల్పించాడు. రెండో భార్యకుతెలియకుండా తీసిన వీడియోను డెమోగా వినియోగ దారులకు చూపిస్తున్నాడు.

ఈసమాచారం తెలుసుకున్న రెండో భార్య విదిషా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు నిందితుడ్ని అదుపులోకీ తీసుకుని విచారించగా షాక్ కు గురయ్యే నిజాలు బయటపడ్డాయి. ఇప్పటికే తన భార్యలకు తెలియకుండా వారితో సన్నహితంగా ఉన్న దృశ్యాలను లైవ్ లో చూపించటం ద్వారా లక్షల రూపాయలు ఆర్జించినట్లు గుర్తించారు.



అతని వద్దనుంచి రూ. 15.50 లక్షల విలువైన బంగారం, రూ.45,500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టులో ప్రారంభించిన ఒక బ్యాంకు ఖాతాలో 6 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

బెంగుళూరుకు చెందిన మొదటి భార్యకు భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపే అవకాశాలు ఉన్నట్లు ఆమెకు ఆశలు కల్పించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె 7వ నెల గర్భవతి. కాగా ఆమె అతడిపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.



రెండో భార్య ఉత్తరప్రదేశ్ కు చెందినది. ఒక అధ్యాత్మిక గురువుకు శిష్యురాలిగా కొనసాగుతోంది. అదే గురువుకు తాను శిష్యుడిగా నటిస్తూ…. ఫేస్ బుక్ లో ఆమెను ఫాలో అయి మాయమాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పడు రెండో భార్య ఫిర్యాదు చేయటంతో బండారం బయటపడింది. విదిషా పోలీసులు నిందితుడిపై ఐటీ చట్టం కింద పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.