ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కి ప్రచారం చేసిన సెలబ్రిటీలకు కోర్టు నోటీసులు

  • Published By: murthy ,Published On : November 3, 2020 / 07:45 PM IST
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కి ప్రచారం చేసిన సెలబ్రిటీలకు కోర్టు నోటీసులు

online gambling : ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు ప్రచారకర్తలుగా ఉన్న సెలబ్రిటీలకు మద్రాస్ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్ కు అనుకూలంగా ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్‌ కొహ్లి, సౌరవ్‌ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్‌, ప్రకాశ్‌ రాజ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ కీలక చర్యలు చేపట్టింది. నవంబర్ 19వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు వారిని ఆదేశించింది.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు నవంబర్3, మంగళవారం, విచారణ జరిపింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్‌ పేర్కోన్నాడు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.



ఆన్ లైన్ రమ్మీని నిషేంధించాలని కోరుతూ మదురై కోర్టులో ఇటీవల ఓ పిటీషన్ దాఖలైంది. ఇటీవలి కాలంలో ఆన్ లైన్ లోరమ్మీ ఆడుతూ అనేక మంది రమ్మీ ఆడుతూ, నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పిటీషనర్ వివరించారు.

తాజాగా రెండు రోజుల క్రితం తమిళనాడులోని కోయంబత్తూరు లో నివసించే మదన్ కుమార్(28) అనే బ్యాంకు ఉద్యోగి ఆన్ లైన్ రమ్మీలో నష్టాలురావటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పిటీషన్ ను విచారించిన కోర్టు తమిళనాడు ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.



తమిళనాడులో ఆన్ లైన్ రమ్మీ నిషేధానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆన్ లైన్ జూదం నిషేధానికి 10 రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.