పెళ్లి పేరుతో గర్భవతిని చేసి….తప్పించుకోటానికి దాడి చేసిన డాక్టర్

10TV Telugu News

Mumbai physician booked for raping and stalking a colleague : పెళ్లి చేసుకుంటానని నమ్మించి… తన సహోద్యోగినిని గర్భవతిని చేసిన డాక్టర్ పై మహారాష్ట్రలోని దహనా పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ముంబైకి చెందిన సహోద్యోగి, తనతో 2018 నుంచి సన్నిహితంగా మెలిగి ఇప్పడు మోసం చేశాడని బాధిత మహిళ(30) పాల్ఘర్ జిల్లా దహనా పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది.

2018 నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో తామిద్దరం అనేకసార్లు సన్నిహితంగా మెలిగామని…..తద్వారా తాను గర్భం దాల్చానని మహిళ పేర్కోంది. నిందితుడైన డాక్టర్, తనను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశాడని… అందుకు అంగీకరించకపోయే సరికి, కొట్టి హింసించేవాడని తెలిపింది.


అబార్షన్ చేయించుకోకపోవటంతో తామిద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టే చేస్తానని బెదిరిస్తూ అనేక సార్లు కొట్టాడని ఆ మహిళ వాపోయింది.
https://10tv.in/ghaziabad-doctor-dates-married-patient-smothers-her-to-death/
మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ పై ఐపిసి సెక్షన్లు 376 (అత్యాచారం), 376 (2) (ఎన్) (పదేపదే అత్యాచారం), 354 (డి) (కొట్టడం), 313 (మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం కలిగించడం) కింద బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.