రేప్ కేసులో విడుదలై వచ్చి మళ్లీ అదే మహిళపై రేప్

అత్యాచారానికి పాల్పడ్డ మహిళ(19)పైనే రెండేళ్ల క్రితం అదే నిందితుడు అత్యాచారం చేశాడు. అప్పుడు సదరు మహిళ మైనర్(17). నేర నిరూపన కావడంతో 2020లో జైలు పాలయ్యాడు. ఈమధ్యే బెయిల్‭పై బయటికి వచ్చాడు. అనంతరమే అదే మహిళపై తన స్నేహితుడి సాయంతో మరోసారి అత్యాచారం చేసి కేసు వెనక్కి తీసుకొమ్మని బెదిరించాడు. నిందితుడి పేరు వివేక్ పటేల్ అని స్థానిక పోలీసు అధికారి ఆసిఫ్ ఇక్బాల్ వెల్లడించారు.

రేప్ కేసులో విడుదలై వచ్చి మళ్లీ అదే మహిళపై రేప్

Madhya Pradesh: అత్యాచారం కేసులో అరెస్ట్ జైలు జీవితం అనుభవించినా ఆ వ్యక్తికి బుద్ధి రాలేదు సరికదా.. తాను అఘాయిత్యం చేసిన మహిళపైనే మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా బెయిల్‭పై విడుదలైన ఆ వ్యక్తి మళ్లీ అదే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‭పూర్ జిల్లా‭లో జరిగిందీ దారుణం. మహిళపై అత్యాచారం చేయడంతో పాటు తనపై పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకోవాలంటూ బెదిరించాడు కూడా. బాధితురాలు మరోసారి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన నెల రోజుల క్రితమే జరిగిందని, నిందితుడితో పాటు అతడి స్నేహితుడు ఈ దారుణంలో పాలుపంచుకున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

ప్రస్తుతం అత్యాచారానికి పాల్పడ్డ మహిళ(19)పైనే రెండేళ్ల క్రితం అదే నిందితుడు అత్యాచారం చేశాడు. అప్పుడు సదరు మహిళ మైనర్(17). నేర నిరూపన కావడంతో 2020లో జైలు పాలయ్యాడు. ఈమధ్యే బెయిల్‭పై బయటికి వచ్చాడు. అనంతరమే అదే మహిళపై తన స్నేహితుడి సాయంతో మరోసారి అత్యాచారం చేసి కేసు వెనక్కి తీసుకొమ్మని బెదిరించాడు. నిందితుడి పేరు వివేక్ పటేల్ అని స్థానిక పోలీసు అధికారి ఆసిఫ్ ఇక్బాల్ వెల్లడించారు. నిందితుడు బాధితురాలి మెడపై కత్తి పెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్టు ఎఫ్ఐఆర్‭లో నమోదు అయినట్లు ఇక్బాల్ తెలిపారు. తాజాగా నిందితుడిపై గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా బాధితురాలిని నిందితుడు బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయింది.
Cyber Fraudster: ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్ ఆర్డర్ చేసి రూ.1.67లక్షలు పోగొట్టుకున్న మహిళ