కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీ భవనం కూల్చిన కార్పోరేషన్ అధికారులు

  • Published By: murthy ,Published On : November 5, 2020 / 05:38 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీ భవనం కూల్చిన కార్పోరేషన్ అధికారులు

Bhopal administration demolishes Congress MLA ’s college building : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాన్ని కార్పోరేషన్ అధికారులు గురువారం కూల్చివేశారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ నిర్మించిన ఐపిఎస్ కళాశాలలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు.



గతంలో భవనాన్ని కూల్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించగా ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రధాన భవనం కూల్చివేతపై జిల్లా కోర్టు 2005లో స్టే ఇచ్చింది. మరో వైపు కాలేజీలో 12వేల చదరపు అడుగుల స్ధలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించినట్లు అధికారులు పేర్కోంటూ ఆ భవనాన్ని గురువారం,నవంబర్5న కూల్చివేశారు.

ఈ సందర్భంగా కాలేజి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్నే తాము కూల్చామని…కోర్టు స్టే ఇచ్చిన భవనాన్ని కూల్చలేదని కార్పోరేషన్ అధికారులు వివరించారు.