నిబంధనలు బేఖాతర్ : 30 మందితో బర్త్ డే పార్టీ జరుపుకున్న వ్యక్తి అరెస్ట్

  • Published By: murthy ,Published On : July 22, 2020 / 08:51 AM IST
నిబంధనలు బేఖాతర్ : 30 మందితో బర్త్ డే పార్టీ జరుపుకున్న వ్యక్తి అరెస్ట్

కోవిడ్ రక్షణ నిబంధనలు గాలికి వదిలేసి 30 మంది అతిధులతో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. జులై18, శనివారం, బాంద్రాలోని తన ఇంట్లో 25 వ పుట్టిన రోజు సందర్బంగా 25 కేకులు కట్ చేసాడు హరిస్ ఖాన్ అనే యువకుడు.

అర్ధరాత్రి జరిగిన ఈ బర్త్ డే పార్టీకి వచ్చిన అతిధులెవ్వరూ మాస్క్లులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. సామూహికంగా ఉండి ఆనందోత్సాహాలతో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గోన్నారు.

మహారాష్ట్ర్రలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వాటిని నిర్లక్ష్యం చేసి కొందరు ఇలా ప్రవర్తించటం మొహిసిన్ షేక్ అనే సామాజిక కార్యకర్తకు కోపం తెప్పించింది.

ఒక స్నేహితుడి ద్వారా వచ్చిన 45 సెకండ్ల నిడివి గల ఈ పుట్టిన రోజు వేడుకల వీడియోను మొహిసిన్ షేక్ ముంబై పోలీసు కమీషనర్ కు టాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

ట్విట్టర్ వీడియో ఆధారంగా బాంద్రా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. హరిస్ ఖాన్ పై 1959 ఆయుధ చట్టంకింద కేసు నమోదు చేశారు.కేకు కట్ చేసిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పార్టీ లో పాల్గోన్న 30 మంది అతిధులపై ఐపీసీ సెక్షన్ 188 (ప్రభుత్వోద్యోగి చేత ప్రకటించబడటానికి అవిధేయత), 269 (జీవితానికి ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణను వ్యాప్తి చేసే నిర్లక్ష్య చర్య) మరియు సెక్షన్ 4 లోని 34 (సాధారణ ఉద్దేశం) చట్టం కింద కేసులు బుక్ చేశారు.