CyrusMistry: సైరస్ మిస్త్రీ మరణ హెచ్చరిక.. సీటు బెల్ట్‭ను లైట్ తీసుకోవద్దు

ఈ ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్‌ నుంచి మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్‌ జిల్లాలో ఉన్న బ్రిడ్జిపైకి రాగానే రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ అసలు సీటు బెల్టే పెట్టుకోలేదని విచారణలో తెలిసింది.

CyrusMistry: సైరస్ మిస్త్రీ మరణ హెచ్చరిక.. సీటు బెల్ట్‭ను లైట్ తీసుకోవద్దు

must wear seat belt says tata sons former chairam cyrus death

CyrusMistry: వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54)తో పాటు జహంగీర్ పండోల్ ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గుజరాత్ నుంచి ముంబయి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న కారు పాల్ ఘర్ జిల్లాలోని సూర్యనందిపై ఉన్న వంతెన వద్ద డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం వాహనదారులకు ఒక హెచ్చరిక చేస్తోంది. సీటు బెల్టును లైట్ తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మృత్యువు నుంచి కాపాడుకోవడం కష్టమనే సంకేతాల్ని బలంగా ఇస్తోంది.

Liz Truss On victory: బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ముందు అనేక సవాళ్ళు.. గెలిచాక ఆమె ఏం చెప్పారంటే..

ఈ ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్‌ నుంచి మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్‌ జిల్లాలో ఉన్న బ్రిడ్జిపైకి రాగానే రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ అసలు సీటు బెల్టే పెట్టుకోలేదని విచారణలో తెలిసింది. ఆయనతో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా సీటు బెల్ట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ఉండేవని దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు.

రాంగ్‌ రూట్‌లో మరో వాహనాన్ని ఎడమ పక్క నుంచి ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. సైరస్ మిస్త్రీ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయారన్న సంగతి తెలిసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. కారు వెనుక సీట్లో కూర్చున్నా ఎల్లప్పుడూ తాను సీట్ బెల్ట్ ధరిస్తానన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నానని, అందరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Delhi: ప్రారంభానికి సిద్దమైన సెంట్రల్‌ విస్టా అవెన్యూ