నీరవ్ మోడీ, మెహుల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఒక్క పైసా కూడా జమ కాలేదు. PNB

  • Published By: murthy ,Published On : October 23, 2020 / 10:35 AM IST
నీరవ్ మోడీ, మెహుల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఒక్క పైసా కూడా జమ కాలేదు. PNB

Nirav Modi, Mehul Choksi : పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మోహిల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఎటువంటి నగదు జమకాలేదని PNB తెలియ చేసింది.

సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు బ్యాంకు సమాధానం ఇచ్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మరియు అతని మామ మెహుల్ చోక్సీలు సంయుక్తంగా రూ. 15,423.39 కోట్లు బాకీ పడ్డారు. మోడీని ఇప్పటికే లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని భారత్ కు అప్పగించే ప్రక్రియ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది.



https://10tv.in/pm-modi-declares-his-assets-all-about-where-he-has-invested-his-personal-wealth/
కాగా నీరవ్ మోడీ నుంచి రూ.7,409.07 కోట్లు, మెహుల్ చోక్సీ నుంచి రూ.8,014.32 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. సామాజిక కార్యకర్త జితేంద్ర ఖడ్జూ సమాచార హక్కు చట్టం కింది అడిగిన ప్రశ్నకు బ్యాంకు ఈసమాచారం అందించింది. కాగా….బకాయిల రికవరీపై అడిగిన ప్రశ్నకు బ్యాంకు సమాధానం ఇవ్వలేదు. వీరిద్దరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను వెల్లడించటానికి కూడా బ్యాంకు నిరాకరించింది.



ఈ వివరాలు ఇస్తే ఇది ఆర్టీఐ చట్టం, 2005 యొక్క U / S 8 (1) (h) కింద నేరస్తుల విచారణకు భంగం వాటిల్లుతుందని పేర్కోంది. ఈ కేసులు వాదించటానికి అయిన ఖర్చులు వివరాలు సమర్పించాలని మరో ఆర్టీఐ దరఖాస్తు దాఖలైనప్పటికీ ….దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని సమాచారం ఇవ్వలేమని బ్యాంకు తెలిపింది. ఆర్టీఐలో వచ్చిన దరఖాస్తులు వాటిపై ఇచ్చిన సమాధానాలపై స్పందించేందుకు బ్యాంకు అధికారులు సుముఖంగా లేరు.