బీజేపీ నేత కుటుంబంలో నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య

బీజేపీ నేత కుటుంబంలో నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య

Rajasthan Four of former BJP Leader suicide : బీజేపీ రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు మదన్‌లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర బీజేపీ వర్గంలో కూడా కలకలం రేపుతోంది. మదన్‌లాల్ సైనీ 2019లో మృతి చెందారు. ఈక్రమంలో ఆయన కుటుంబంలో ఏకంగా నాలుగు ఆత్మహత్యలు తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న వారిలో హనుమాన్ ప్రసాద్, అతని భార్య తార, వారి ఇద్దరు కుమార్తెలు అంజు, పూజ ఉన్నారు. వీరంతా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

హనుమాన్ ప్రసాద్, తార దంపతుల 17 ఏళ్ల పెద్ద కుమారుడు గత సెప్టెంబరులో మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబం అంతా తీవ్ర మానసిక వ్యధలో కృంగిపోతున్నారు. ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. నిత్యం అతని ధ్యాసలోనే ఉండటంతో తీవ్ర డిప్రెషన్ లోనే ఉండిపోయారు. ఈక్రమంలో అతని మరణ విషాదం నుంచి కోలుకోలేక తీవ్ర మానసిక వ్యధలో కూరుకుపోయారు.బంధువులు ఎంతగా చెప్పినా అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈక్రమంలో అతని ఎడబాటుని భరించలేక సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

వీరి కుటుంబంలో ఆత్మహత్యల సమాచారం అందుకున్న వెంటనే ఉద్యోగ్ నగర్ పోలీసులు, జిల్లా ఎస్పీ కున్వర్ రాష్ట్రదీప్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సికర్‌లోని శ్రీ కల్యాణ్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కొడుకు లేకుండా బ్రతకటం చాలా కష్టంగా ఉందని అతన్ని మరచిపోలేకపోతున్నామని..అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సదరు కుటుంబం ఆత్మహత్య లేఖలో రాసి పెట్టారు. ఆలేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యల గురించి సికర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ..తమకు సమాచారం అంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి నలుగురి మృతదేహాలు ఉరికి వేలాడుతున్నట్టు సికర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర శర్మ తెలిపారు. కుమారుడు చనిపోయిన తర్వాత వీరంతా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు అదే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

బీజేజీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్‌లాల్‌ సైనీ సోదరుడి కుమారుడే హనుమాన్ ప్రసాద్ అని పోలీసులు తెలిపారు. మదన్‌లాల్ సైనీ 2018 జూన్ నుంచి రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటికి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. వసుంధరా రాజే సింధియా సీఎంగా కొనసాగుతున్నారు. అయితే, ఆయన 2019 జూన్‌లో అనారోగ్య కారణాలతో మృతిచెందారు.