కామాంధులు…వృధ్దురాలిపై ఇద్దరి అత్యాచారం

  • Published By: murthy ,Published On : November 1, 2020 / 06:51 AM IST
కామాంధులు…వృధ్దురాలిపై ఇద్దరి అత్యాచారం

90 years old woman gang raped : కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లకు వావి వరసలు , వయస్సు బేధాలు కనిపించవంటారు. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అదే జరిగింది. బామ్మ అని పిలుస్తూనే 90 ఏళ్ల వృధ్దురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన హీనమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

త్రిపురలోని కంచన్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబరు24న ఒంటరిగా జీవిస్తున్న 90 ఏళ్ల వృధ్దురాలి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఆమెను బామ్మా అని పిలిచే వ్యక్తి కూడా ఉన్నాడు. వారిద్దరూ ఆమెపై అత్యాచారం చేసి వెళ్లిపోయారు. దీంతో వృధ్దురాలు అనారోగ్యం పాలైంది. బంధువులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.


అక్కడ జరిగిన విషయం డాక్టర్లుకు చెప్పటంతో, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృధ్దురాలి వాంగ్మూలం స్వీకరించారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని ఎస్పీ భానుపాడా చక్రవర్తి తెలిపారు.