అశ్లీల వీడియోలు చూపిస్తున్న ట్యూషన్ మాస్టర్ అరెస్ట్

  • Edited By: murthy , August 13, 2020 / 07:55 AM IST
అశ్లీల వీడియోలు చూపిస్తున్న ట్యూషన్ మాస్టర్ అరెస్ట్

పిల్లలకు అదనపు జ్ఞానం కోసం పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రైవేటు మాస్టారు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపించటం మొదలెట్టాడు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో ప్రైవేటు మాస్టారును పోలీసులు అరెస్టు చేశారు.

మధ్య ప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసించే 10 ఏళ్ళ బాలుడు ఒక మాస్టారు దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటున్నాడు. తరగతిలో పాఠాలు చెప్పాల్సిన సమయంలో మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూపిస్తున్నాడని విద్యార్ధి తన తల్లి తండ్రులకు చెప్పాడు. దీంతో వారు ట్యూషన్ మాస్టార్ సునీల్ పై బార్ర్రా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని, ఫోన్ లో లోడ్ చేసిన అభ్యంతరకరమైన డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.నిందితుడిపై పోక్సో చట్టంకింద, ఐపీసీ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఇన్స్పెక్టర్ హర్మీత్ సింగ్ చెప్పారు.