మహిళలను వేధించిన వారికి తగిన శాస్తి చేసిన పోలీసులు

  • Published By: murthy ,Published On : November 22, 2020 / 01:11 PM IST
మహిళలను వేధించిన వారికి తగిన శాస్తి చేసిన పోలీసులు

Two held for harassing women : మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు వ్యక్తులకు భోపాల్ పోలీసులు తగినబుద్ధి చెప్పారు. కేసులు పెట్టి దర్యాప్తు చేసి ఎప్పుడో శిక్ష పడేలా కాకుండా, ప్రజలందరికీ తెలిసేలా వారికినడిరోడ్డు మీద శిక్ష విధించారు. నిత్యం రద్దీగా ఉండే దేవాస్ లోని ఒక వీధిలో నిందితులిద్దరినీ కూర్చో పెట్టి వారిని గుంజీలు తీయించారు. మధ్య ప్రదేశ్ పోలీసులు పోస్ట్ చేసిన ఈవీడియోలో ఓ మహిళా పోలీసు వీరిని లాఠీతో కొట్టటం కూడా జరిగింది.



కాగా….. జాతీయ నేర రికార్డుల బ్యూరో 2019 నివేదిక లెక్కల ప్రకారం భారతదేశంలో మహిళలపై నేరాలు 2018 నుంచి 2019 వరకు 7.3 శాతం పెరిగాయి. ఇదే కాలంలో షెడ్యూల్డ్‌ కులాలపై నేరాలు కూడా 7.3 శాతం పెరిగాయి. దేశంలో మహిళలపై నేరాలలో మధ్యప్రదేశ్‌ ఆరోస్థానంలో ఉంది. గత సంవత్సరం రాష్ట్రంలో 27,560 కేసులు నమోదయ్యాయి.