నెల జీతంలో కోత పెట్టాడని యజమాని హత్య

  • Published By: murthy ,Published On : August 26, 2020 / 10:19 AM IST
నెల జీతంలో కోత పెట్టాడని యజమాని హత్య

జీతం విషయంలో గొడవపడి యజమానిని హత్య చేశాడో ఉద్యోగి. ఉత్తర ప్రదేశ్లో ని షామ్లీకి చెందిన తస్లీమ్ (21) అనే యువకుడు ఢిల్లీ లో ఒక డైరీ ఫాం లో పని చేస్తున్నాడు.  గతంలో హోటల్ లో పనిచేసిన  తస్లీమ్   కరోనాలాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో డైరీ ఫాం నిర్వహిస్తున్న ఓం ప్రకాష్ (45) వద్ద 15 వేల రూపాయల జీతానికి పనికి కుదిరాడు. అప్పటినుంచి తస్లీమ్, ఓం ప్రకాష్ వద్ద పనిచేస్తున్నాడు.



ఆగస్ట్ 10వ తేదీన ఓంప్రకాష్, తస్లీమ్ కు నెల జీతం ఇస్తూ …. కరోనా వైరస్ కారణంగా గత నెల వ్యాపారం సరిగా జరగలేదు…. జీతంలో కొంత తగ్గించి తీసుకోమని కోరాడు. తస్లీమ్ అందుకు అంగీకరించలేదు. ఈవిషయంలో ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓం పక్రాష్ తస్లీమ్ ను చెంపదెబ్బ కొట్టాడు. గొడవ అంతటితో సర్దుమణిగి తస్లీమ్ తన పని తాను చేసుకోటానికి వెళ్ళిపోయాడు.

ప్రకాష్ చెంప దెబ్బ కొటట్టాన్ని జీర్ణించుకోలేని తస్లీమ్ యజమానిపై పగ పెంచుకున్నాడు. ఆరోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా తస్లీమ్ లేచి తన యజమాని ప్రకాష్ రూం వద్దకు వచ్చాడు. నిద్రలో ఉన్న ఓం ప్రకాష్ తలపై కర్రతో దాడి చేశాడు. అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి సమీపంలోని బావిలో పడేసి పరారయ్యాడు. మర్నాడు ఉదయం యజమాని బంధువులకు ఫోన్ చేసి వ్యాపార పనిమీద ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు చెప్పాడు.



కాగా ఓం ప్రకాష్ రెండు రోజులగా కనపడటంలేదని అతని మేనల్లుడు ఆగస్ట్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు, ప్రకాష్ డైరీ ఫాం వద్దకు వచ్చి పరిశీలించారు. అక్కడ ఉన్న బావిలోంచి దుర్వాసనరావటంతో, అక్కడకు వెళ్ళి చూడగా బాధితుడిమృతదేహం బావిలో తేలుతూ కనిపించింది. పనివాడు తస్లీమ్ కనపడకుండా పోవటంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
https://10tv.in/gurugram-police-arrest-three-men-for-gang-raping-many-times-in/
మృతుడి సెల్ ఫోన్, బైక్ నిందితుడు తస్లీమ్ ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. వెంటనే అతడి సొంతూరుకు పోలీసులను పంపించారు. అక్కడ తస్లీమ్ ఆచూకి లభించలేదు. అతను గతంలో పనిచేసిన హర్యానా ఇతర ప్రాంతాల్లో గాలించినా నిందితుడి ఆచూకీ లభిచంలేదు. ఢిల్లీలోని ఝరోడా ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం తెలియటంతో ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.