తీహార్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకస్మిక మరణం, అసలేం జరిగింది

  • Published By: naveen ,Published On : July 16, 2020 / 08:29 AM IST
తీహార్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకస్మిక మరణం, అసలేం జరిగింది

ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్తితిలో మరణించింది. ఇటీవలే ఆమెకి తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తన ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. సౌత్ ఢిల్లీలోని పాలమ్ జిల్లాలో బుధవారం(జూలై 15,2020) ఈ ఘటన జరిగింది. అద్దె ఇంట్లో ఆమె నివాసం ఉంటోంది. కానిస్టేబుల్ తల్లిదండ్రులు హర్యానాలోని రివారి జిల్లాలో నివాసం ఉంటున్నారు.

ఎప్పటిలాగే సా.7 గంటలకు ఇంటికి వెళ్లింది, ఆ తర్వాత దారుణం జరిగిపోయింది:
మహిళా కానిస్టేబుల్ 2018లో ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరింది. ప్రస్తుతం ఢిల్లీ ఆర్మ్డ్ 3వ బెటాలియన్ లో ఉంది. ఇటీవలే తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. తీహార్ జైల్లో డైలీ డైరీ ఎంట్రీ రైటర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 వరకు డ్యూటీలో ఉంటుంది. ఎప్పటిలాగే మంగళవారం(జూలై 14,2020) విధులు పూర్తి చేసుకుని సాయంత్రం 7 గంటలకు ఇంటికి వెళ్లింది. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇంట్లో శవమై కనిపించింది.

తీహార్ జైలుకి కానిస్టేబుల్ మరణానికి లింకు ఉందా?
రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమికంగా మర్డర్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కానిస్టేబుల్ ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? చంపాల్సిన అవసరం ఏముంది? నిందితుడు ఎవరు? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి స్థానికంగా సంచనలంగా మారింది. తీహార్ జైల్లో పోస్టింగ్ తర్వాత ఆమె విగతజీవిగా మారడం చర్చకు దారితీసింది. ఆమె మరణానికి తీహార్ జైలు డ్యూటీకి ఏదైనా లింకు ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.