ఇడ్లీ బాగోలేదన్న అయిదేళ్ళ చిన్నారి : కొట్టి చంపిన పెద్దమ్మ

  • Published By: murthy ,Published On : September 10, 2020 / 01:56 PM IST
ఇడ్లీ బాగోలేదన్న అయిదేళ్ళ  చిన్నారి : కొట్టి చంపిన పెద్దమ్మ

తమిళనాడులోని  కళ్శకురిచ్చి జిల్లాలో దారుణం జరిగింది. ఇడ్లీ బాగోలేదని చెప్పిన బాలిక… ఓ మహిళ కొట్టిన దెబ్బలకు తనువు  చాలించింది. కళ్ళకురుచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపంలోని మెల్ విళి గ్రామానికి చెందిన రోసారియో, జయవాణి దంపతులకు రెన్సీమేరీ (5) అనే కుమార్తె ఉంది. మూడేళ్లక్రితం జయరాణి మరణించటంతో రోసారియో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి రోసారియో కుమార్తె అయిదేళ్ల రెన్సీ మేరి తన అమ్మమ్మ పచ్చయమ్మాళ్ ఇంట్లో ఉంటోంది. అక్కడే జయరాణి అక్క ఆరోగ్య మేరీ కూడా ఉంటోంది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో సెప్టెంబర్7వ తేదీ, సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా రెన్సీ మేరీని ఇడ్లీ తినమని ఆరోగ్య మేరీ కోరింది. అవి బాగోలేవని చెప్పి స్నేహితులతో ఆడుకోటానికి బాలిక బయటకు వెళ్లింది. దీంతో ఆరోగ్యమేరీకి కొపం వచ్చింది.



స్నేహితులతో బయట ఆడుకుంటున్న రెన్సీ మేరీని చావబాదుతూ ఇంట్లోకి తీసుకు వచ్చింది.  తలుపులు మూసేసి కర్రతో విపరీతంగా రెన్సీమేరిని కొట్టింది. బాలిక  కేకలు విన్న ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే గాయాల పాలైన రెన్సీమేరీని త్యాగదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
https://10tv.in/karimnagar-granny-sells-1-month-old-baby-girl-1-10-lakh-grand-daughter-in-telanganas/
అక్కడ ప్రాధమిక చికిత్స చేసి…మెరుగైన వైద్యం కోసం కళ్ళకురుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై త్యాగదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరోగ్యమేరిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.