Surat: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురు మిస్సింగ్, 20 మందికి గాయాలు

చూస్తున్నంతలోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం అంటున్నాయి. ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఇది గమనించి బయటికి పరుగులు తీశారు. అయితే ఒక కార్మికుడు మాత్రం అక్కడే చిక్కిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోయిన కార్మికుల కోసం తనిఖీ చేస్తున్నాం. పదిహేను ఫైర్ టెండర్లను ఘటనా స్థలానికి రప్పించి దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటల్ని ఆర్పాము

Surat: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురు మిస్సింగ్, 20 మందికి గాయాలు

Surat: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‭లో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. కాగా, ఈ ప్రమాదంలో మరో ముగ్గురు కనిపించకుండా పోయారని, వారి గురించి వెతుకుతున్నట్లు సూరత్ పోలీసు అధికారులు తెలిపారు. సచిన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న అనుపం రసయాన్ ఇండియా లిమిటెడ్ అనే కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 10:30 గంటలకు భారీ ఎత్తున పేలుడు సంభవించిండంతో ఈ ఘటన చోటు చేసుకుందని సూరత్ ఇంచార్జ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు.

‘‘చూస్తున్నంతలోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం అంటున్నాయి. ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఇది గమనించి బయటికి పరుగులు తీశారు. అయితే ఒక కార్మికుడు మాత్రం అక్కడే చిక్కిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోయిన కార్మికుల కోసం తనిఖీ చేస్తున్నాం. పదిహేను ఫైర్ టెండర్లను ఘటనా స్థలానికి రప్పించి దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటల్ని ఆర్పాము. ప్రస్తుతానికి కంపెనీలో మంటలు తగ్గాయి’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Electricity Bill Scam: ఎలక్ట్రిసిటీ బిల్ స్కాం.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త.. లేకుంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ