ఇంటి ఓనర్ తో అక్రమ సంబంధం… తేడాలు రావటంతో అత్యాచారం చేశాడని ఆరోపణ

  • Published By: murthy ,Published On : August 23, 2020 / 11:01 AM IST
ఇంటి ఓనర్ తో అక్రమ సంబంధం… తేడాలు రావటంతో అత్యాచారం చేశాడని ఆరోపణ

గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో 23 ఏళ్ల విశాల్ ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గురువారం ఆగస్ట్,20వ తేదీన ఇంటి అద్దె చెల్లించటానికి యజమాని ఇంటికి వెళ్లాడు. అక్కడ యజమాని భార్యకు అద్దె చెల్లించాడు.

అద్దె చెల్లించిన తర్వాత ఆంటీతో మంచి, చెడూ మాట్లాడుతూ తనతో పాటు తెచ్చుకున్న కూల్ డ్రింక్ ను ఆమెకూ ఇచ్చి తాగమని చెప్పాడు.  డ్రింక్ తాగిన తర్వాత ఆమెకు మైకం కమ్మింది. ఆమె స్పహ తప్పిపోయిందని తెలుసుకున్నాక ఆమెపై అత్యాచారం చేయబోయాడు.

విశాల్ ఇచ్చిన డ్రింక్ తాగిన తర్వాత తనకు మైకం కమ్మిందని….. ఆతర్వాత అతను తన ఒంటిపై బట్టలు తీయటం మొదలెట్టాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. తనను పూర్తిగా వివస్త్రను చేశాక తనపై అత్యాచారం చేయబోయాడని వివరిచింది. తనపై లైంగిక దాడి జరుగుతోందని అర్ధమై తాను  ప్రతిఘటించబోయానని……కానీ అప్పటికే తనకు మైకం కమ్మటంతో ప్రతిఘటించటానికి శక్తి లేకపోయిందని తెలిపింది.

తాను ప్రతిఘటించినప్పుడు తనను విశాల్ కొట్టాడని, ఈవిషయం ఎవరికైనా చెపితే తనను, తన పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. బాధితురాలి భర్త ఉపాధి నిమిత్తం రాజస్ధాన్ వెళ్లాడు. గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడని మహిళ తెలిపింది.

మహిళ పిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి, ఖుర్జా లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద అభియోగాలు మోపారు. నిందితుడిని స్ధానిక కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

బాధితురాలి ఆరోపణలు ఖండించిన నిందితుడు
కాగా నిందితుడి వాదన వేరోక విధంగా ఉందని పోలీసు సబ్ ఇన్సెక్టర్ ఫిరోజ్ ఖాన్ చెప్పారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న నిందితుడు విశాల్ కు ఇంటి యజమానురాలికి అక్రమ సంబంధం ఉంది. ఇంటి యజమాని ఉపాధి కోసం రాజస్ధాన్ వెళ్ళాడు. దేశంలో మార్చి నెలాఖరు నుంచి లాక్ డౌన్ అమలవటంతో అతను అక్కడే చిక్కుకుపోయాడు.

ఈ క్రమంలో ఇంట్లో పిల్లలతో జీవిస్తున్న యజమాని భార్యతో విశాల్ కు అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త దూరంగా ఉండటం… పరాయి మగవాడితో పరిచయం ఏర్పడిన ఆంటీ మూడో కంటికి తెలియకుండా విశాల్ తో సరసాలు ఆడేది. అవకాశం చిక్కినప్పుడల్లా ఇద్దరూ రాసలీలల్లో మునిగి తేలేవారు.

కొన్నాళ్లకు అన్ లాక్ ప్రక్రియ మొదలవటంతో ఒకసారి భర్త ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య అక్రమ సంబంధం విషయం అతనికి తెలిసి పోయింది. భార్యతో గొడవపడిన భర్త, విడిపోవటానికి నిశ్చయించుకుని, తిరిగి ఉపాధికోసం రాజస్ధాన్ వెళ్లిపోయాడు. ఈక్రమంలో మహిళ తనను బ్లాక్ మెయిల్ చేయటానికి అత్యాచారం చేసానని ఆరోపిస్తోందని విశాల్ తెలిపాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.