దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడని అగ్రకుల యువకుడ్ని కొట్టి చంపేసారు

  • Published By: nagamani ,Published On : November 13, 2020 / 05:17 PM IST
దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడని అగ్రకుల యువకుడ్ని కొట్టి చంపేసారు

Delhi : కంప్యూటర్ యుగంలో కూడా కులాలు..మతాలు..ఆచారాలు, సంప్రదాయాలు అంటూ హింసాత్మక ఘటన జరుగుతునే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో కులం చాలా కీలకంగా మారింది.ఈక్రమంలో ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగావ్ లో దళిత యువతిని పెళ్లిచేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడ్ని కొంతమంది అత్యంత కిరాతకంగా హతమార్చారు.



రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన గుర్గావ్ ప్రాంతంలోని భోండ్సీలో రాహుల్ సింగ్ అనే యువకుడు కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ తమ్ముడు ఆకాశ్ అనే 28 ఏళ్ల యువకుడు బాద్షాపూర్ కు చెందిన ఓ దళిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం జరిగి ఐదునెలలు గడిచింది. వివాహం జరిగినప్పటి నుంచి ఆకాశ్ కుటుంబానికి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఆకాశ్ తన భార్య తల్లిదండ్రులతో మాట్లాడదామని పెళ్లి అయిన మొదటిసారి ఆదివారం (నవంబర్ 9,2020) ఆమెతో పాటు గురుగావ్ లోని బాద్షాపూర్ కు వెళ్లాడు.



అలా వెళ్లిన ఆకాశ్ పై కొంతమంది దుండగులు ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. తమ్ముడిని ఎవరో కొడుతున్నారని తెలిసిన రాహుల్ హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే తీవ్ర గాయాలతో పడిఉన్న తమ్ముడిని వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చికిత్సనందిస్తున్నాడు.


రాహుల్ తన తమ్ముడిపై దాడికి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం (నవంబర్ 10) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడిపై దాడి చేసినవారు అతని భార్య గ్రామస్తులేనని..వారంతా ఐదుగురు అగ్రవర్ణానికి చెందినని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన తమ్ముడిపై పైపులు..ఇనుపరాడ్లతో దాడికి పాల్పడిన పవన్, మోహిత్, రవి, అజయ్, లాలు, ధర్మేదర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. రాహుల్ ఫిర్యాదుతో బాధ్షాపూర్ పోలీసులు సదరు నిందితులపై ఐపిసి సెక్షన్లు 223, 228, 506, ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.


ఈక్రమంలో చికిత్స పొందుతు ఆకాశ్ బుధవారం (నవంబర్ 11) మృతి చెందాడు. దీంతో తన తమ్ముడిపై దాడి చేసినవారిపై హత్యా నేరం కింద వారిని కఠినంగా శిక్షించాలని కోరుతు మరోసారి బాద్షాపూర్ పోలీసుల్ని ఆశ్రయించాడు రాహుల్ సింగ్.తన తమ్ముడు బాద్షాపూర్ దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడని అతన్ని వారి గ్రామం రావద్దని హెచ్చరించారని కానీ..పెళ్లి చేసుకున్న తరువాత తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లి వారితో మాట్లాడదామని వెళ్లిన తన తమ్ముడిని అత్యంత కిరాతకంగా కొట్టి..హింసించి చంపేసారని పేర్కొన్నాడు.


ఆకాశ్ పై దాడికి చేసినట్లుగా ఆ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దాడి అభియోగంగా ఐపిసి సెక్షన్లు 223, 228, 506, ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తరువాత ఆకాష్ బుధవారం మరణించిన తరువాత, ఐపిసి సెక్షన్ 302 (హత్య) ను ఎఫ్ఐఆర్లో చేర్చారు.