పోలీసుల్నే టార్గెట్ చేసిన లేడీస్ టైలర్..కిలాడీ లేడి ట్రాప్ లో ఆరుగురు ఎస్సైలు

పోలీసుల్నే టార్గెట్ చేసిన లేడీస్ టైలర్..కిలాడీ లేడి ట్రాప్ లో ఆరుగురు ఎస్సైలు

Hyderabad women blackmailed  six sub inspectors : హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉంటున్న ఓ లేడీ టైలర్ ట్రాప్ లో పడ్డవాళ్లంతా గిలగిలా కొట్టుకుంటున్నారు. వీరిలో ఆరుగురు సబ్ ఎస్సైలు కూడా ఉండటం విశేషం. మాయలు చేసేవారి వల్లో పడొద్దని చెప్పే పోలీసులే ఆ లేడీస్ టైలర్ ట్రాప్ లో చిక్కుకున్నారు. భర్తతో వచ్చిన విభేధాలతో విడిపోయి పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ లేడీస్ టైరల్ పలువురు పురుషులపై ‘తాను ఒంటరిదాన్నని తెలిసి..నన్న వేధిస్తున్నారని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కేసులు పెడుతుంది.

దీంతో పరువుపోతుందనే భయంతో ఆమెకు డబ్బులిచ్చి రాజీ కుదుర్చుకునేవారు. అలా ఎంతకాలం మిషన్ కుడుతూ పిల్లల్ని పోషించుకోవటం..ఇలాగైతే కష్టపడకుండానే డబ్బులొస్తున్నాయి కదానుకుందేమో దాన్ని కంటిన్యూ చేసింది. కానీ మోసాలు ఎల్లకాలం నడవుకదా..కొమ్ములు తిరిగిన పురుషులే నన్ను ఏమీ చేయలేకపోయారు..ఈమె ఏం చేస్తుంది?అనుకుని ఓ మహిళతో పెట్టుకున్న గొడవ కాస్తా ఆ లేడీస్ టైలర్ గుట్టు బైటపడింది..

వనస్థలిపురంలో నివసిస్తున్న శ్రీలతరెడ్డి భర్తతో విడిపోయింది. దాదాపు 13 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరు పిల్లలతో కుట్టుమిషన్ కుడుతూ జీవిస్తోంది. భర్తకు దూరమైన శ్రీలత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నిరోజుల క్రితం ఆ వ్యక్తితో గొడవపడి తనను మోసం చేశాడని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సదరు వ్యక్తి పరువుపోతుందని భయపడి ఆమెకు కొంత డబ్బులిచ్చి రాజీ కుదుర్చుకుని మాఫీ చేయించుకున్నాడు.

అలా శ్రీలతారెడ్డి ట్రాపుల పర్వం కొనసాగింది. దాంట్లో భాగంగా ఏకంగా పోలీసుల్నే టార్గెట్ చేసింది. అలా ఆమె వలలో ఆరుగురు ఎస్సైలు చిక్కుకున్నారు అంటే ఆ వలపుల వల ఎలా ఉంటుందో ఊహించాల్సిందే..డబ్బులు రాబట్టుకోవటానికి ఎంతోమందిమీద కేసులు పెట్టటం తరువాత వాళ్లతో రాజీలు కుదుర్చుకుని డబ్బులు గుంజటం పరిపాటిగా మారిపోయింది లేడీస్ టైలర్ శ్రీలతారెడ్డికి.

దీంట్లో భాగంగానే..వనస్థలిపురం ఎస్‌ఐ రామయ్య, నాగరాజు, రాజు అనే వ్యక్తులు భర్తకు దూరంగా ఉంటున్న తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని అబాండాలు వేసింది. రాజేందర్‌రెడ్డి అనే ఎస్సై అతని స్నేహితుడు మధుసూదన్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌పై కూడా కేసులు పెట్టింది. కేసులు పెట్టాక.. వారితో ఆమె బేరాలు కుదుర్చుకుని భారీగా డబ్బులు గుంజి ఆ తరువాత కేసులను విత్ డ్రా చేసుకుంటుంది.

ఇలా వచ్చే సంపాదనకు శ్రీలత అలవాటుపడింది. పోలీస్ శాఖలోని వారినే టార్గెట్‌గా చేసుకుంది. ఈమె మాయ మాటలు నమ్మి ఆరుగురు ఎస్సైలు మోసపోయినట్లు తెలిసింది. వీరితో పాటు.. బయటపడని చాలామంది ఈ మాయలేడి ట్రాప్‌లో పడినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మాయల లేడీ శ్రీలతరెడ్డి మోసాల గుట్టు బైటపెట్టే ఘటన ఒకటి జరిగింది. శ్రీలతారెడ్డి ఓ మహిళతో గొడవపడింది. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారి సదరు మహిళ శ్రీలతపై ఎస్సీ, ఎట్రీ అట్రాసిటీ కేసు పెట్టింది. ఈ క్రమంలో.. శ్రీలతను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దీంట్లో బాగంగా విచారణ చేయగా శ్రీలతారెడ్డి చేసిన గారడీలు వెల్లడయ్యాయి. ఈజీ మనీ కోసం పురుషులను ట్రాప్ చేసి చేసిన మోసాల చిట్టా బైటపడింది. ఒంటరి మహిళలనే పేరుతో తనను వేధిస్తున్నారంటూ పలువురిపై వేధింపుల కేసు పెట్టి ఇబ్బందిపెట్టిన శ్రీలత చిట్టా బైటపడటంతో ఇప్పుడు ఆమె రిమాండ్ కు విధించటంతో ఆమె పిల్లల భవిష్యత్‌ను అంధకారంలోకి పడినట్లైంది.