రక్షకుడే భక్షకుడు : విచారణ కోసమని తీసుకెళ్లి మహిళపై పోలీసు అత్యాచారం

రక్షకుడే భక్షకుడు : విచారణ కోసమని తీసుకెళ్లి మహిళపై పోలీసు అత్యాచారం

Punjab 24 year old woman head constable raped: రక్షకులే భక్షకులైతే బాధితులు తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గరకెళ్లి తమ కష్టాలను తీర్చమని చెప్పుకోవాలి? ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అరాచకాలకు..అత్యాచారాలకు తెగబడుతుంటే ఇంక లా అండ్ ఆర్డర్ కు దిక్కెవరనే దారుణ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ఓ మహిళను విచారణ కోసమని తీసుకెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన లూధియానాలో జరిగింది. ఈ దారుణానికి సంబంధించి 24 ఏళ్ల బాధిత మహిళ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తనపై జరిగిన దారుణం గురించి బాధిత మహిళ చెబుతూ.. “నా భర్త స్నేహితుడు తరుచు మా ఇంటికి వస్తుండేవాడు. దీంతో అతని బంధువులు మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానించారు. దీంతో డిసెంబర్ 3వ తేదీ నేను ఒంటరిగా ఉన్న సమయంలో పమ్మి, పూజ, బిందా, మమత అనే వాళ్లు మా ఇంటికొచ్చి నామీద దాడి చేశారు. నన్ను చాలా దారుణంగా కొట్టారు. నా బట్టలు చింపేసి..నన్ను వివస్త్రను చేసి సెల్‌ఫోన్లతో వీడియో తీశారు. ఈ వీడియోతో నన్ను బెదిరిస్తురనీ మండియన్ కలాన్ పోలీసుల పోస్ట్‌లో ఫిర్యాదు చేశాననీ కాని పోలీసులు మాత్రం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. దాన్ని అలుసుగా తీసుకున్న సదరు వ్యక్తులు ను. కానీ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. డిసెంబర్ 5న ఆ నలుగురు మా ఇంటికి మరోసారి వచ్చి నాపై మళ్లీ దాడి చేశారని లేఖలో పేర్కొంది.

వారి దాడులకు భయపడి.. నేను మా ఇంటిని వదిలి బంధువుల ఇంటికి వెళ్లిపోయాను. డిసెంబర్ 6వ తేదీన ఇల్లు ఖాళీ చేయటానికి అర్ధరాత్రి 12.30 గంటలకు వెళ్లాను. ఆ విషయం తెలుసుకున్నవారు అక్కడికి చేరుకుని నన్ను మాటలతో వేధించారు. ఆ తరువాత హెడ్ కానిస్టేబుల్ రాకేశ్ కుమార్‌కు ఫోన్ చేశారు. అతడు మహిళ పోలీసు లేకుండానే మా ఇంటికి వచ్చి..నా భర్తతో పాటు, నన్ను కూడా మండియన్ కలాన్ పోలీస్ పోస్ట్‌కు తీసుకెళ్లాడు.

అక్కడ రాకేష్ కుమార్ నా భర్తపైనా నా పైనా దాడి చేశాడు. రాత్రి వరకూ మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచేశారు. రాత్రి సమయంలో విచారణ కోసమని పోలీస్ పోస్ట్ ఫస్ట్ ఫోర్ కు తనను రూమ్‌కు రాకేష్ నన్ను తీసుకెళ్లాడు. నా ఫోన్ లాక్కుని పక్కన పడేశాడు. పోలీస్ పోస్ట్‌లో మహిళ పోలీసులు ఉన్నాగానీ..అతని రూమ్‌లో మాత్రం మహిళ పోలీసులు ఎవరూ లేరు. తన రూమ్‌లో కి తీసుకెళ్లిన రాకేష్ నాపై అత్యాచారం చేశాడు. ఈ విషయం గురించి బయట చెబితే నా భర్తపై కేసులు బనాయిస్తానని హెచ్చరించాడని ఆమె వాపోయింది.

దీంతో భయపడ్డ నేను 11 రోజుల పాటు తనపై జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాను. కానీ దీని గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నా..ఈ విషయాన్ని ఇప్పటికైనా బైటపెట్టకుంటే నాలాంటి ఇంకెంతో మంది మహిళలు రాకేశ్ కుమార్ కు బలైపోతారనే ఉద్ధేశ్యంతో డిసెంబర్ 17న ఈ ఘటనపై కమిషనర్ రాకేష్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశానని చెప్పింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేశారు ఉన్నతాధికారులు.

సదరు బాధిత మహిళ రాసిన లేఖపై జమల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇన్స్‌స్పెక్టర్ కుల్వాంత్ సింగ్ మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్‌ రాకేష్ కుమార్‌పై కేసు నమోదు చేసామని..బాధితురాలిపై దాడికి పాల్పడ్డ నలుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు సంబంధించి పోలీస్ పోస్ట్ ఇన్ చార్జ్ ఏఎస్‌ఐ భల్‌దేవ్ సింగ్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.