నా భార్యను చంపేశా..దేనికైనా రెడీగా ఉన్నా.. ఉరిశిక్ష వేసినా ఓకే..

నా భార్యను చంపేశా..దేనికైనా రెడీగా ఉన్నా.. ఉరిశిక్ష వేసినా ఓకే..

Telangana man who murdered his wife : ‘నా భార్యను నేనే చంపేశా..నాకు ఉరి శిక్ష వేసినా ఓకే..దేనికైనా రెడీగా ఉన్నానని అంటున్నాడో భర్త. పెళ్లి అయి 12 ఏళ్లు అయి..ఇద్దరు పిల్లల తల్లి అయిన భార్య ప్రాణాల్ని నిలువునా తీసేశాడా భర్త. అనుమానం పెనుభూతంగా మారి సంసారాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. భార్యమీద పెంచుకున్న అనుమానంతో ఆమె గత సోమవారం (జనవరి 15,2021) ప్రాణాలు తీసి ఆ తరువాత స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. నా భార్యను నేను చంపేశాను..నాకు ఉరి శిక్ష వేసినా ఓకే అంటూ చెప్పుకొచ్చాడు.

తెలంగాణాలోని మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు సమీపంలో ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన కొండబత్తుల నరేశ్‌ అనే వ్యక్తి డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతనికి 12 ఏళ్ల క్రితం చిన్నగూడూరు మండలం జయ్యారానికి చెందిన సరిత అనే యువతితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు. పెద్ద పాప సిరివెన్నెల వయస్సు 10ఏళ్లు, చిన్నపాప మేఘనకు 6ఏళ్లు. డీసీఎం డ్రైవర్ గా పనిచేసే నరేశ్ కు సరిత రెండోభార్య. వీరి కాపురం బాగానే సాగుతోందనుకునే క్రమంలో గత కొంత కాలంగా సరితపై నరేశ్ కు అనుమానం పుట్టింది. దీంతో సరిత ఏం చేసినా తప్పు పట్టేవాడు. వేధించేవాడు.

ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం నరేశ్ భార్యతో గొడవపడ్డాడు. దారుణంగా కొట్టాడు. భర్త కొట్టిన దెబ్బలకు సరిత తీవ్రంగా గాయపడింది. ఆ విషయం తెలిసిన సరిత తల్లి వచ్చి ఆమెను తనతో కూతుర్ని చిన్న మనుమరాలు మేఘనను తీసుకెళ్ళింది. సోమవారం జయ్యారం వెళ్లిన నరేశ్‌ భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తానని అత్తకు చెప్పి సరితను తీసుకెళ్లాడు. భార్యా భర్తలన్నాక ఇటువంటివి సాధారణమే అనుకున్న సరిత తల్లి అల్లుడు చెప్పిన మాటలు నమ్మింది. కూతుర్ని అల్లుడు కూడా పంపించింది.

అలా భార్య సరితతో పాటు చిన్నకూతురు మేఘనను కూడా తీసుకుని మహబూబాబాద్‌కు వచ్చాడు. అక్కడి నుండి మోటార్‌సైకిల్‌పై బయ్యారం మండలం నామాలపాడు అటవీప్రాంతానికి తీసుకొచ్చాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం..తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సరితను దారుణంగా పొడిచాడు. అప్పటికీ సరిత ఇంకా చనిపోలేదని తెలుసుకుని గొంతునుమిలి చంపేశాడు. తరువాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని తన సెల్‌ఫోన్‌ నుంచే డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు విషయం చెప్పాడు. వెంటనే గార్ల–బయ్యారం సీఐ తిరుపతి, ఎస్‌ఐ జగదీశ్‌ ఘటనాస్థలానికి చేరుకుని నరేశ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

కాగా..పోలీసులు సరితను హత్య చేసిన స్థలానికి చేరుకునేలోపు అప్పటికే కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మరకలతో ఉన్న నరేశ్ ను ఏం జరిగిందని అడిగారు. దానికి నరేశ్ ..‘ నా భార్యను నేనే చంపేశానను..నేనే ‘పోలీసులకు ఫోన్ కూడా చేశాను..వాళ్లు వచ్చేదాకా ఇక్కడే ఉంటా.. దేనికైనా సిద్ధమే.. నాకు ఉరిశిక్ష వేసినా పర్వాలేదు’అన్నాడు. దాంతో వాళ్లు హడలిపోయారు. నేను అన్నింటికీ సిద్ధపడే నా భార్యను చంపా..కూడా చనిపోవడానికి రెడీగా ఉన్నా… నేనేమైనా చంపలేదని చెబుతున్నానా..’అని అతడు అనడం స్థానికులను షాక్ కు గురిచేసింది.