Home » Crime Stories » ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి డాక్టర్ కిడ్నాప్…రూ.20లక్షలు డిమాండ్
Updated On - 1:54 pm, Sat, 6 February 21
up 5 arrested for kidnapping doctor : యూపీలో ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ చేతిలో డబ్బులేదు. దీంతో ఓ డాక్టర్ ని కిడ్నాప్ చేసాడు. అనంతరం డాక్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన డాక్టర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా పాపం ఆ ప్రేమికుడి ప్లాన్ బెడిసికొట్టి కటకటాలపాలయ్యాడు. అలీఘర్‌లో గత జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అలీఘర్ కు చెందిన అనుజ్ చౌదరి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత కొంత కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఆ తరువాత ఇద్దరూ కలిసి బతకటానికి అతని దగ్గర డబ్బు లేదు. అదే విషయం అనుజ్ తన నలుగురు స్నేహితులకు చెప్పాడు. నా దగ్గరో ప్లాన్ ఉంది..మన ఏరియాలోనే ఓ డాక్టర్ ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామని చెప్పాడు. దానికి ఫ్రెండ్స్ కూడా సరేనన్నారు. నీకు సహాయం చేస్తామని మాట కూడా ఇచ్చారు.
దీంతో అనుజ్ రంగంలోకి దిగి..స్థానికంగా ఉండే ఓ డాక్టర్ ను జనవరి 28న కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత సదరు డాక్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. వెంటనే తెచ్చి ఇవ్వకపోతే డాక్టర్ ని చంపేస్తామని బెదిరించాడు.
దీంతో డాక్టర్ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లు ఫోన్ చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ కోసం గాలించి కిడ్నాపర్లు ఫోన్ చేసిన నంబర్ సిగ్నల్స్ ఆధారంగా 30న కనిపెట్టారు. కిడ్నాపర్ల నుంచి డాక్టర్ కు విముక్తి కల్పించారు.
అనంతరం అనుజ్‌తో పాటు అతని నలుగురు ఫ్రెండ్స్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద ఉన్న తుపాకులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.వారిని విచారించగా ఓ అమ్మాయిన ప్రేమించానని పెళ్లి చేసుకోవటానికి ఇలా డాక్టర్ ను కిడ్నాప్ చేశామని అనుజ్ తెలిపాడు. దీంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకటానికి ఇలా కిడ్నాప్ లు చేస్తావేంట్రా పిచ్చి వెధవా..అని తిట్టి రిమాండ్ కు తరలించారు.
Stray Dogs Campaign: వీధి కుక్కలపై పోస్టర్లు అంటించి వింత ప్రచారం
Robbing Monkeys : అడవుల్లో కోతుల్ని పట్టి తీసుకొచ్చి జనాలపైకి వదిలి దోపీడీలు
Love Jihad : మతం దాచి పెట్టి పెళ్లి చేసుకున్న భర్తపై లవ్ జిహాద్ కేసు పెట్టిన భార్య
తండ్రి చనిపోయినట్లు కల : 30 ఏళ్లకు ముగ్గురు పిల్లల తండ్రిగా కన్నవారిని కలుసుకున్న కొడుకు
UP Accident : లోయలో పడిన ట్రక్..11మంది మృతి..
కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని ఫోటోలతో బెదిరింపులు..