హత్రాస్ అత్యాచారం కేసులో ట్విస్ట్..బాధితురాలి తండ్రిని కాల్చి చంపేసిన నిందితుడు

హత్రాస్ అత్యాచారం కేసులో ట్విస్ట్..బాధితురాలి తండ్రిని కాల్చి చంపేసిన నిందితుడు

up hathras rape case..bail man accused kills woman father:  దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన యూపీలోని హత్రాస్ రేప్ కేసులో ఊహించన ఘటన జరిగింది. ఈ అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి బాధితురాలి తండ్రిని కాల్చి చంపేసాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. హత్రాస్ అత్చాచారం ఘటన..అదే కేసులో నిందితుడు బాధితురాలి తండ్రిని ఏకంగా కాల్చి చంపేయటంతో మరోసారి ఉలిక్కిపడినట్లైంది. ఇటువంటి ఘటనలతో దేశం ఎటుపోతోందనే ఆందోళన కలుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ రేప్ కేసును ఇప్పటికీ ప్రజల మనసులో ఓ దారుణంగా ముద్ర వేసుకొనే ఉంది. ఆ దారుణ ఘటనకు కొనసాగింపు తాజాగా జరిగిన ఈ కాల్పులు బాధితుల పట్ల ఎంత నిర్ధయంగా దారుణంగా వ్యవహరిస్తున్నారో కళ్లకు కట్టింది.

అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి…2018లో జైలు కెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈక్రమంలో అతను ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. సోమవారం (మార్చి 1,2021) సాయంత్రం 4.30 గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న ఓ దేవాలయం దగ్గర బాధిత కుటుంబం, నిందితుడి కుటుంబం మధ్య గొడవ జరిగిందనీ… అందులో భాగంగానే కాల్పులు జరపడంతో… బాధితురాలి తండ్రి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందించినా ఫలితం లేకుండాపోయింది. బుల్లెట్ గాయాలతో బాధితురాలి తండ్రి మరణించాడని పోలీసులు తెలిపారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోలీసులు వెల్లడించారు. అత్యాచారం కేసులో బాధితురాలి ఫిర్యాదు చేయడంతో… నిందితుడు గౌరవ్ శర్మ… 2018లో ఓ నెల పాటూ జైల్లో ఉన్నట్లు తెలిపారు. నెల తర్వాత స్థానిక కోర్టు అతనికి బెయిల్ ఇచ్చిందని..అప్పటి నుంచి అతను బయటే ఉన్నాడని తెలిపారు.

ఈ సందర్బంగా పోలీసు అధికారి వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ..ఆ రెండు కుటుంబాలకూ అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో నిందితుడి భార్య, బంధువుతో కలిసి దేవాలయానికి వెళ్లారు. అక్కడే మృతుడి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అక్కడ ఇరు వర్గాల మధ్యా గొడవ జరగగా… నిందితుడు, బాధితురాలి తండ్రి మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఆ గొడవ అంతకంతకూ పెరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణ దాకా వెళ్లింది. దీంతో నిందితుడు పరుగున వెళ్లి… తన కుటుంబానికి చెందిన కొంత మంది కుర్రాళ్లను తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాధితురాలు తండ్రిపై నిందితుడు కాల్చి చంపాడు.. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశామని హత్రాస్ పోలీస్ చీఫ్ వినీత్ జైస్వాల్  ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో స్టేట్‌మెంట్‌లో తెలిపారు.

నిందితుడు గౌరవ్ శర్మ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. అధికారులు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం… ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కఠిన శిక్షలు పడాలని ఆదేశించారు. న్నారు. దీనిపై స్థానిక జర్నలిస్టులు కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. అసలు గౌరవ్ శర్మకు అప్పుడే శిక్ష విధించి, అమలు చేసి ఉంటే… ఈనాడు ఈ దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.