పుల్‌గా తాగిన పోలీసు మహిళలపై వేధింపులు.. ప్రశ్నించిన యువకుడ్ని కాల్చి చంపిన దారుణం

10TV Telugu News

UP : Police sexually harasses women : అతనో పోలీసు. వీధి రౌడీగా ప్రవర్తించాడు. పుల్ గా మద్యం తాగి మహిళల్ని లైంగిక వేధింపులకు గురిచేశాడు. అదేమని అడిగిన ఓ వ్యక్తిని నిర్ధాక్ష్యిణ్యంగా కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశలో చోటుచేసుకుంది. నేరాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ లో ఖాకీ తన కావరానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది.ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు అధికార మధంతో చెలరేగిపోయి మహిళల్ని అసహ్యంగా వేధించటమే కాకుండా ప్రశ్నించిన ఓ వ్యక్తిని తన తుపాకీతో కాల్చి చంపిన ఘటన యూపీలోని అజంగఢ్ లో జరిగింది.వివరాల్లోకి వెళితే..అజంగఢ్ కు చెందిన సర్వేశ్ అనే పోలీసు.. మద్యం తాగి స్థానికంగా ఉండే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారిని తాకరాని చోట తాకుతూ.. లైంగిక వేధింపులకు గురి చేశాడు. దారి వెంట వెళ్లేవారిని అడ్డుకుని మీద చేతులు వేస్తూ అసహ్యంగా మాట్లాడారు. దీంతో పోలీసే అలా చేస్తుంటే తాము ఇంకెవ్వరితో చెప్పుకోవాలతో తెలీక ఆ మహిళలు భయపడిపోయారు.ఓ గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తున్న మహిళలు ఓచోట ఆగారు. అక్కడకు వచ్చిన సర్వేశ్.. వారిపై అసభ్యంగా ప్రవర్తించాడు. తమను వదిలిపెట్టాలని ఆ మహిళలు వేడుకున్నారు. కానీ మద్యం మత్తు బాగా తలకెక్కినవాడు వినలేదు.ఇదంతా అక్కడ ఉన్న ఓ యువకుడు చూశాడు. మహిళలంతా భయపడిపోతుంటే అక్కడకొచ్చి వాళ్లదారిన వాళ్లు వెళుతుంటే ఎందుకిలా వేధిస్తున్నారని ప్రశ్నించాడు. అంతే అసలే పోలీసు.పైగా తాగి ఉన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సర్వేశ్ తన దగ్గర ఉన్న తుపాకీ తీసి కాల్చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి మహిళలంతా బిక్కచచ్చిపోయారు. కానీ తప్పుని ప్రశ్నించినందుకు పాపం ఆ యుడకుడు ప్రాణాలు కోల్పోయాడు.


ఇదంతా జరుగుతున్న సమయంలో మరో ముగ్గురు పోలీసులు అక్కడే ఉన్నా.. వాళ్లు ఏమాత్రం నోరెత్తలేదు. మహిళల్ని వేధిస్తున్న పోలీసుని అడ్డుకోలేదు. ఓ యువకుడ్ని దారుణంగా కాల్చిపారేసినా ఏమాత్రం నోరు మెదపకపోవటం గమనించాల్సిన విషయం.