పెళ్లి పేరుతో మహిళ వద్ద నుంచి రూ.10లక్షలు కాజేసిన వ్యక్తి అరెస్ట్

ఎదుటి వారిని మోసం చేసి తేరగా డబ్బు సంపాదించేయాలనుకునే మోసగాళ్లు సమాజంలో రాన్రాను పెరిగిపోతున్నారు. తాను కెనడాలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పి హైదరాబాద్ కు చెందిన మహిళ వద్దనుంచి 10 లక్షల రూపాయలు కాజేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 27, శనివారం అరెస్ట్ చేశారు.

పెళ్లి పేరుతో మహిళ వద్ద నుంచి రూ.10లక్షలు కాజేసిన వ్యక్తి అరెస్ట్

Matrimonial fraud : UP man posing as Canada-based doctor promises to marry Hyderabad woman, dupes her of Rs 10 lakhs : ఎదుటి వారిని మోసం చేసి తేరగా డబ్బు సంపాదించేయాలనుకునే మోసగాళ్లు సమాజంలో రాన్రాను పెరిగిపోతున్నారు. తాను కెనడాలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పి హైదరాబాద్ కు చెందిన మహిళ వద్దనుంచి 10 లక్షల రూపాయలు కాజేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 27, శనివారం అరెస్ట్ చేశారు.

పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో హైదరాబాద్ కు చెందిన   ఒక మహిళ మ్యాట్రిమోని వెబ్ సైట్ లో తన వివరాలు నమోదు చేసుకుంది. ఆవివరాలు చూసి ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ కి చెందిన మహ్మద్ హసీబ్ అనే వ్యక్తి తప్పుడు వివరాలతో తన ప్రోఫైల్ అదే మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్నాడు.

హసీబ్ హైదరాబాద్ కు చెందిన మహిళ వివరాలు చూసి తాను కెనడాలో పని చేస్తున్న డాక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. మహిళ వివరాలు నచ్చాయని… ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అందులో భాగంగా ఆమెతో పరిచయం చేసుకుని గతేడాది అక్టోబర్ నుంచి మాట్లాడటం మొదలెట్టాడు.

ఈ క్రమంలో ఆమెకు కెనడా నుంచి గిఫ్ట్ గా కోటి రూపాయలు విలువైన బంగారం, వజ్రాభరణాలు పంపిస్తున్నానని చెప్పి ఒక పార్శిల్ పంపించాడు. అతను చెప్పిన కొద్ది రోజులకు ఢిల్లీ విమానాశ్రయంనుంచి కస్టమ్స్ ఆఫీసర్ నంటూ ఒక వ్యక్తి ఫోన్ చేసి ..కెనడా నుంచి మీ పేరున పార్శిల్ వచ్చిందని… ఢిల్లీ విమానాశ్రయంలో ఉందని, దాన్నివిడిపించటానికి రూ. 10లక్షల 70 వేల రూపాయలు చెల్లించాలని ఫోన్ చేశాడు.

కెనడాకు చెందిన డాక్టర్ వివరాలు , తన వివరాలు చెప్పే సరికి, కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తిని నమ్మి, అతను చెప్పిన బ్యాంకు ఎకౌంట్ కు హైదరాబాద్ మహిళ డబ్బును పంపించింది. డబ్బు పంపించి రెండు మూడు రోజులైన పార్సిల్ ఇంటికి రాకపోయేసరికి ఆ మహిళ ఢిల్లీలోని వ్యక్తికి, కెనడాలోని వరుడికి ఫోన్ చేయగా ఆ రెండు ఫోన్ల్ స్విచ్చాఫ్ అయ్యాయి.

తానుమోసపోయానని గ్రహించిన మహిళ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బరేలి వెళ్లి అక్కడున్న మహ్మద్ హసీబ్ ను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారంట్ పై శనివారం హైదరాబాద్ తీసుకువచ్చారు. కేసువిచారణ కొనసాగుతోంది.