సెక్స్ సైకోలుగా మారిన దంపతులు : అసహజ శృంగారం కోసం బరితెగింపు

శృంగారం అంటే ఇష్టం లేనివాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి... యవ్వనానికి వచ్చిన 16,17 ఏళ్ల వారి నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న ముదుసలి వరకు అందరూ అర్రులు చాచేవాళ్లే . వీళ్లలో కొందరు  వెరైటీ

సెక్స్ సైకోలుగా మారిన దంపతులు : అసహజ శృంగారం కోసం బరితెగింపు

శృంగారం అంటే ఇష్టం లేనివాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి… యవ్వనానికి వచ్చిన 16,17 ఏళ్ల వారి నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న ముదుసలి వరకు అందరూ అర్రులు చాచేవాళ్లే . వీళ్లలో కొందరు  వెరైటీ మనుషులు  ఉంటారు. అసహజ శృంగారానికి  అలవాటు పడతారు. వీరితోనే ఇబ్బంది ఏర్పడుతుంది.

పడక సుఖం కోసం వెంపర్లాడుతూ సెక్స్ సైకోగా మారిన మహిళ ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. అంతేకాదు మహిళ అయి ఉండి ఆమె అమ్మాయిలతో అసహజ శృంగారానికి అలవాటు పడింది.  మైనరు బాలికలను లైంగింకంగా హింసించి పైశాచికానందం పొందేది. దీనికి తోడు ఆమె భర్త సహకారం కూడా లభించింది.  ఇద్దరూ కలిసి నాలుగేళ్లలో నలుగురుని లైంగిక వేధింపులకు గురి చేశారు.

ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వీరు చేసిన  అసహజ శృంగార  కార్యకలాపాలు బయటపడటంతో అమెరికాలోని మాడిసన్ కౌంటీ కోర్టు భార్యా భర్తలకు  జైలు శిక్ష విధించింది. భార్యకు 75 ఏళ్లు భర్తకు 40 ఏళ్ళు జైలు శిక్ష పడింది.

Also Read | భార్యపై అక్రమ సంబంధం అనుమానం : కూతుర్ని రేప్ చేసి చంపిన తండ్రి

అమెరికాలోని ఇల్లినాయిస్ కు చెందిన ఆండ్రియా లీస్ గాంగ్ (38)  ఆమె భర్తజెర్మీ  లీస్ గాంగ్(31) లు 2016-2018 మధ్య కాలంలో మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడ్డారు.  సెక్స్ కి బానిసగా మారిన ఆండ్రియా అసహజ శృంగారం కోసం మైనర్ బాలికలను హింసించేది. భర్త జెర్మీ తో కలిసి వికృత చేష్టలకు పాల్పడేది. మైనర్లను లైంగికంగా వేధించి భార్య భర్తలు  పైశాచిక ఆనందం పొందేవారు.

ఈ విషయాలు బయటకు పొక్కడంతో  భార్యాభర్తలు ఇద్దరూ అరెస్టయ్యారు. సెక్స్ సైకోలుగా మారిన దంపతులపై విచారణ జరిపిన న్యాయస్ధానం కఠిన శిక్షలు విధించింది. ఆండ్రియా పై నమోదైన   రెండు అభియోగాల్లో ఒకదానికి 15 ఏళ్ళు, మరో దానికి 60 ఏళ్ళు శిక్ష విధిస్తున్నట్లు అటార్నీ టామ్  గిబ్బన్ తీర్పు చెప్పారు.

సెక్స్ సైకోలుగా మారిన దంపతులు జరిపిన లైంగిక దాడిలో మైనర్లు నమ్మకం కోల్పోయారని..నిందితులను జైలుకు పంపడం వల్ల వారికి పూర్తిన్యాయం జరిగినట్లు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలపై ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడినవారు జీవితాంతం జైలులోనే ఉండాలని వ్యాఖ్యానించింది.

Also Read | కాలేజీ విద్యార్ధినిపై అత్యాచారం కేసులో నటుడి కుమారుడు అరెస్ట్

ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే వీరిని జైలునుంచివిడుదలచేయకూడదని న్యాయస్ధానం తీవ్రంగా వ్యాఖ్యనించింది. ఒక వేళ వారు జైలు నుంచి విడుదలైనా  వారిని తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడిన వారిగా పరిగణించాలని పేర్కోంది.