Survey: దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒక మహిళపై భర్త వేదింపులు

అతి తక్కువగా నాగాలాండ్ రాష్ట్రంలో 6.4 శాతం మంది మహిళలు తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 8.3 శాతం, గోవా 8.3 శాతంతో ఉన్నాయి. అక్షరాస్యత పరంగా ముందంజలో ఉన్న కేరళలో 9.9 శాతం ఈ వేధింపులు ఉన్నట్లు సర్వే తెలిపింది. దేశ రాజధాని డిల్లీలో సైతం 22.6 శాతం మహిళలపై ఈ వేధింపులు తప్పట్లేదు.

Survey: దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒక మహిళపై భర్త వేదింపులు

1 in 3 women in India have experienced physical or sexual violence from their husbands

Survey: దేశంలో ఉన్న మహిళల్లో 30 శాతం మందిపై అంటే.. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు, భర్త వేధింపులు ఎదుర్కొంటున్నారట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విడుదల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2019-2021 మధ్య నిర్వహించిన ఈ సర్వే ప్రకారం దేశంలోని 29.3 శాతం మహిళలపై భర్తలు భౌతిక, లైంగిక వేధింపులకు దిగుతున్నారట. ఇది దేశ సగటు కాగా, అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 44.4 శాతం మహిళలు ఈ వేధింపులు ఎదుర్కొంటున్నారట. అంటే రాష్ట్రంలోని సగం మంది మహిళలు తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నట్లు సర్వే వెల్లడించింది.

ఆ తర్వాత బిహార్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 40 శాతం మహిళలు ఈ వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. మణిపూర్ రాష్ట్రంలో సైతం 40 శాతం మందిపై ఈ వేధింపులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మన పొరుగు రాష్ట్రం తమిళనాడు 38 శాతం వేధింపులతో నాలుగవ స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం 37 శాతం వేధింపులతో ఐదో స్థానంలో ఉంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త మెరుగ్గానే ఉంది. ఆ రాష్ట్రంలో 30 శాతం మంది మహిళలు ఈ వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు.

ఇక అతి తక్కువగా నాగాలాండ్ రాష్ట్రంలో 6.4 శాతం మంది మహిళలు తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 8.3 శాతం, గోవా 8.3 శాతంతో ఉన్నాయి. అక్షరాస్యత పరంగా ముందంజలో ఉన్న కేరళలో 9.9 శాతం ఈ వేధింపులు ఉన్నట్లు సర్వే తెలిపింది. దేశ రాజధాని డిల్లీలో సైతం 22.6 శాతం మహిళలపై ఈ వేధింపులు తప్పట్లేదు.

Birthday at Crematorium: స్మశానంలో పుట్టినరోజు వేడులకు చేసుకున్న వ్యక్తి.. బర్త్‭డే కేక్ కటింగ్‭తో పాటు బిర్యాని విందు కూడా అక్కడే