Madhya Pradesh: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది మృతి

ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సోమవారం జరిగింది.

Madhya Pradesh: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది మృతి

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దారుణం జరిగింది. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ అనే ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.

Rajasthan: అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి

ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇంకో పన్నెండు మంది కూడా గాయపడగా, వీరికి ప్రాణాపాయం లేదని సమాచారం. అగ్నిప్రమాద ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఆస్పత్రిలోని మిగతా పేషెంట్లను కాపాడి, వేరే ఆస్పత్రులకు తరలించారు. హాస్పిటల్‌లో మంటలు చుట్టుముట్టడంతో లోపల ఉన్న పేషెంట్లు బయటికి రావడం కష్టమైపోయింది. ఒకే దారి ఉండటం.. అది కూడా మంటల్లో చిక్కుకోవడంతో పేషెంట్లు అందులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

Uttar Pradesh: 48 గంటలపాటు అత్యవసర చికిత్స ఉచితం… యూపీ ప్రభుత్వం నిర్ణయం

చివరకు ఫైర్ సిబ్బందికి కూడా మంటలను ఆర్పడం కష్టమైపోయింది. ఎలక్ట్రికల్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.