Kurnool Police Station : కర్నూలు పోలీస్ స్టేషన్‌లో 105 కిలోల వెండి, రూ.2లక్షల నగదు మాయం.. దొంగలు పడ్డారా?

నగదు, వెండి మాయమైన ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది. సీజ్ చేసిన 105 కేజీల వెండి, రూ.2.15లక్షల నగదు మాయమవడం కలకలం రేపింది.(Kurnool Police Station)

Kurnool Police Station : కర్నూలు పోలీస్ స్టేషన్‌లో 105 కిలోల వెండి, రూ.2లక్షల నగదు మాయం.. దొంగలు పడ్డారా?

Kurnool Police Station : ఇంట్లో దొంగలు పడి నగదు, నట్రా దోచుకెళ్తే పోలీసులను ఆశ్రయిస్తాం. షాప్ లో, మాల్స్ లో దొంగలు పడినా పోలీసులు రావాల్సిందే. అలాంటిది.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే నగదు మాయమైతే. అవును.. కర్నూలు పోలీస్ స్టేషన్ లో అదే జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి నగదు, వెండి మాయమైన ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది. సీజ్ చేసిన 105 కేజీల వెండి, రూ.2.15లక్షల నగదు మాయమవడం కలకలం రేపింది.

పోలీస్ స్టేషన్ నుంచి వెండి, నగదు మాయమైన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. 2021లో 105 కేజీల వెండి, రూ.2లక్షల 15వేల నగదును సీజ్ చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్ నుంచి నగదు, వెండి మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన వ్యక్తి 2021లో సరిహద్దుల్లో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకెళ్తున్న వెండి, నగదును అధికారులు సీజ్ చేశారు. పంచలింగాల గేట్ దగ్గర సీజ్ చేశారు.

Also Read..Fake Currency Gang : ఏం తెలివి.. యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల తయారీ.. హైటెక్ ముఠా అరెస్ట్

అనంతరం అధికారులు సీజ్ చేసిన వెండిని, నగదుని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు. ఇది జరిగి రెండు మూడేళ్లు కావొస్తోంది. కాగా, వెండికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకుని ఆ వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. దీంతో అతడికి వెండి, నగదు ఇచ్చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు తీసుకుని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తనకు సంబంధించిన సీజ్ చేసిన వెండి, నగదు తనకు ఇచ్చేయాలన్నాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో ఉంచిన వెండి, నగదు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది.(Kurnool Police Station)

పోలీస్ స్టేషన్ లో ఉంచిన వెండి, నగదు మాయమైన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారా? లేక సిబ్బందే చేతివాటం ప్రదర్శించారా? అనేది తెలియాల్సి ఉంది. రూ.75లక్షల విలువ చేసే 105 కిలోల వెండి, రూ.2లక్షల నగదు పోవడం హాట్ టాపిక్ గా మారింది.

పోలీస్ స్టేషన్ లో తనకు సంబంధించిన వెండి, క్యాష్ మాయమైనట్టు తెలుసుకుని తమిళనాడుకు చెందిన ఆ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. దాదాపు నలుగురు సీఐలు ఆ స్టేషన్ నుంచి మారిపోయారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న సీఐ.. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించారు.

Also Read..UPI Fraud: కొత్త నెంబర్ నుంచి యూపీఐ ద్వారా మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే

అసలేం జరిగింది? వెండి, నగదు ఏమైంది? ఎవరు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. తాలూక పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఉంటుంది. అలాంటి పీఎస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎవరి ఇళ్లలో అయినా డబ్బు పోతే పోలీసులను ఆశ్రయిస్తాం. అలాంటిది పోలీస్ స్టేషన్ లోనే వెండి, నగదు మాయమైతే ఇంకెవరికి చెప్పుకోవాలి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.(Kurnool Police Station)